
లక్నో : బీజీపీని దెబ్బకొట్టి అధికారం చేజిక్కిచుకోవాలనే ఉద్దేశంతోనే ఎస్‌పీ-బీఎస్‌పీలు చేతులు కలుపుతున్నాయని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విమర్శించారు. అధికారమే పరమాధిగా మాయావతి-అఖిలేష్‌లు చేతులు కలిపి రాజీకొచ్చారని యోగి ఆరోపించారు.
శనివారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గోరఖ్‌పూర్ ఉప ఎన్నికలో వారి కూటమి విజయం సాధించినా, 2019 ఎన్నికల్లో మాత్రం వాళ్ల ప్రభావం ఉండబోదని చెప్పారు. ‘రానున్న ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేది తేల్చుకోండి’ అంటూ విపక్షాలకు ఆయన సవాలు విసిరారు.
ఇక అతి విస్వాసమే గోరఖ్‌పూర్, పుల్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమన్న ఆయన.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 80 స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్‌కౌంటర్లపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ... శాంతి భద్రతల కోసం, క్రిమినల్స్‌ను కట్టడి చేయటం కోసం ఇలాంటి చర్యలు తప్పేం కాదని సమర్థించుకున్నారు.