కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. సీబీఐ ఉదంతం నేపథ్యంలో మమతా బెనర్జీ ధర్నా చేపట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. ముఖ్యమంత్రే ధర్నాకు దిగడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అభ్యంతరం వ్యక్తం చేశారు. పురూలియాలో మంగళవారం ప్రచార ర్యాలీలో పాల్గొన్న యోగి మమతా దీక్షను ఎద్దేవా చేశారు.
అవినీతిపై విచారణకు ఆమె అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. కాగా పురూలియా ర్యాలీకి హాజరయ్యేందుకు యోగి హెలికాఫ్టర్‌కు అధికారులు అనుమతి నిరాకరించడంతో లక్నో నుంచి జార్ఖండ్‌లోని బొకారోకు చాపర్‌లో వచ్చిన యోగి అక్కడి నుంచి 50 కిమీ దూరంలోని పురూలియాకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. మరోవైపు బీజేపీ చీఫ్ అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రుల ర్యాలీలకు సైతం ఇటీవల బెంగాల్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇక కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ అధికారుల దాడులకు నిరసనగా మమతా బెనర్జీ చేపట్టిన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment