సాక్షి,న్యూఢిల్లీ: ఆగ్రా ఫతేపూర్ సిక్రీలో విదేశీ దంపతులపై జరిగిన దాడిని యూపీ మాజీ సీఎం, ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఖండించారు. యూపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే యోగి ఆధిత్యానాథ్ ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్వ్కాడ్స్ ఏమయ్యాయని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఫతేపూర్ సిక్రీని సందర్శించిన జంట అక్కడ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా వారిపై దాడులు జరిగాయని అఖిలేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత జరిగినా యాంటీ రోమియో బృందాలు ఏం చేస్తున్నాయని అఖిలేష్ నిలదీశారు. కాగా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. యూపీ సర్కార్‌ను దీనిపై నివేదిక కోరానని, దుండగుల దాడిలో గాయపడ్డ స్విస్ దంపతులను తమ మంత్రిత్వ శాఖ అధికారలు పరామర్శిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.
స్విస్ దంపతులపై దాడి ఘటనకు సంబంధించి నలుగురు దుండగులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఘటనకు బాధ్యుడైన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment