Akhikesh Yadav
-
వరుణ్‌కు టిక్కెట్ ప్లాన్ చేసిన అఖిలేష్?
లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇదేసమయంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇవ్వకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన స్నేహితుడు వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. యూపీలోని పిలిభిత్ స్థానానికి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇక్కడి నుంచి సమాజ్‌వాదీ పార్టీ వరుణ్‌గాంధీని బరిలోకి దింపవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వరుణ్ గాంధీకి ఇక్కడి టిక్కెట్ ఇస్తారనే ఊహాగానాలకు ఈ సమావేశం మరింత బలాన్నిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, నామినేషన్ల దాఖలుకు మార్చి 27 చివరి తేదీ. నామినేషన్ పత్రాల పరిశీలన తేదీ మార్చి 28. నామినేషన్ల ఉపసంహరణ తేదీ ఏప్రిల్ 30. ఎన్నికల తేదీ ఏప్రిల్ 19. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
భారత్‌లో ఇరాన్ జంట కష్టాలు.. ఆదుకున్న ఎస్పీ నేత!
సైకిల్ యాత్రపై భారత్‌కు వచ్చిన ఇరాన్ దంపతులను తిరిగి వారి దేశానికి తిరిగి పంపేందుకు యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆర్థిక సాయం అందించారు. ఈ ఇరాన్ దంపతులు ప్రపంచ శాంతి సందేశాన్ని ఇస్తూ, సైకిల్‌పై భారతదేశానికి వచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌పారం ఎక్స్‌లో అఖిలేష్ యాదవ్ ఈ వివరాలను తెలియజేస్తూ మానవత్వం కంటే గొప్ప మతం లేదని, సహాయానికి మించిన ఆరాధన లేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి వచ్చి, మన దేశంలో చిక్కుకుపోయిన ఈ అతిథుల కోసం ఏదో ఒకటి చేయడమనేది తన అదృష్టం అని అఖిలేష్ అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా.. ఈ జంట తిరుగు ప్రయాణపు టికెట్ రద్దయింది. వారి దగ్గర డబ్బలు కూడా లేవు. ఈ విషయాన్ని పార్టీ నేత ఒకరు అఖిలేష్ యాదవ్‌కు తెలియజేశారు. దీంతో ఈ జంటకు అఖిలేష్ సాయం అందించారు. ఈ జంటను వారి దేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది కూడా చదవండి: గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత! इंसानियत से बड़ा धर्म और मदद से बड़ी इबादत कोई और नहीं, कुछ और नहीं। जंग के हालातों की वजह से, ईरान से आकर हमारे देश में फँसे इन मेहमानों की देश वापसी में हम कुछ कर पा रहे हैं, ये हमारी ख़ुशक़िस्मती है। देश की छवि दुनिया में सिर्फ़ कहने से नहीं, कुछ अच्छा करने से बनती है। pic.twitter.com/RtvlRmhaci — Akhilesh Yadav (@yadavakhilesh) October 27, 2023 -
ఎస్పీని బోల్తా కొట్టించిందీ.. కమలాన్ని వికసింపజేసిందీ ఆ 10 అంశాలే!
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రేంజ్లో వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల జాతీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఊహించని షాకిచ్చారు. గెలుపు మాదంటే మాదే అని ధీమాగా ఉన్న కొన్ని పార్టీలకు ఓటర్లు భారీ ట్విస్ట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ పార్టీ మరోసారి కాషాయ జెండా ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ బీజేపీకే యూపీ ఓటర్లు మరోసారి పట్టం కట్టారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. 2012 తరహాలో ఎలక్షన్ రిజల్ట్‌ను పునరావృతం చేయాలని భావించిన సమాజ్‌వాదీ పార్టీకి మరోసారి ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అధికారంలోకి రావాలన్న ఆయన ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. కానీ, 1996 తర్వాత 100 సీట్లు దాటిన ప్రతిపక్షంగా ఎస్పీ రికార్డు సాధించింది. యూపీలో గతంలో ప్రతిపక్షానికి 50 సీట్లు దాటిన దాఖలాలు లేవు. బీజేపీ గెలుపునకు కారణాలు ఇవే.. 1. రామ మందిర నిర్మాణం.. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన రోజు నుంచే అధికార బీజేపీ రామమందిర నిర్మాణం అంశాన్ని హైలెట్ చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టేసింది. పక్కా ప్లాన్‌తో ముందుకు సాగింది. 2. ఎన్నికల ప్రచారంలోకి కీలక నేతలు.. యూపీలో కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ కీలక నేతలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం బీజేపీకి ప్లస్ పాయింట్‌గా మారింది. 3. యోగి కాంట్రవర్సీ కామెంట్స్.. ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆదిత్యనాథ్.. బూల్డోజర్ల ప్రస్తావన తెచ్చారు. రాష్ట్రంలో నేరాలు చేస్తే సహించేది లేదంటూ.. నేరస్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వారి కోసం బూల్డోజర్లు రెడీగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెను దుమారమే చెలరేగింది. కానీ, అదే చివరకు అధికార పార్టీకి ప్లస్ పాయింట్ అయినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు లవ్ జిహాద్ కేసుల్లో పట్టుబడిన దోషులకు పదేళ్ల జైలు శిక్ష వంటి అంశాలు కూడా కలిసొచ్చాయి. 4. అట్రాక్ట్ చేసిన ఉచిత పథకాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ.. లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్-2022 పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఫ్రీ రేషన్, ఉచిత కరెంట్, మద్దతు ధర హామీలకు ఓటర్లలు ప్రభావితం అయ్యారు. 60 ఏళ్లు నిండిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, యువతకు భారీగా ఉద్యోగాల కాన్సెప్ట్ కూడా ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించింది. 5. ఫలించిన గో సంరక్షణ మంత్రం.. యూపీలో గోవధపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో గోవులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాము అధికారంలోకి వస్తే గోవుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్టు చేస్తున్నట్టు యోగి తెలిపారు. ఎక్కువ సంఖ్యలో గోశాలలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ ఓటమికి కారణాలు.. 1. స్టార్ క్యాంపెయినర్లు కరువు.. ఎన్నికల ప్రచారంలో సమాజ్‌వాదీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు కరువయ్యారు. ప్రచారంలో అఖిలేష్ యాదవ్‌తో పాటు కేవలం ఎస్పీకి చెందిన కొందరు నేతలు మాత్రమే పాల్గొన్నారు. ఎస్పీకి చెందిన జయా బచ్చన్, డింపుల్ చౌదరి స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నప్పటికీ వారు ప్రచారంలోకి రాలేకపోయారు. ఇది పార్టీకి పెద్ద నెగిటివ్‌గా మారింది. 2. ప్రభావం చూపని ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు బూస్ట్ ఇస్తాయని భావించారు. ఈ ఘటనలపై ప్రజా వ్యతిరేకత వస్తుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. 3. యాదవ-ముస్లిం పార్టీగా ఎస్పీపై ముద్ర.. యాదవ-ముస్లిం పార్టీగా సమాజ్‌వాదీ పార్టీపై ముద్రవేయడంలో అధికార బీజేపీ పూర్తిగా విజయవంతమైంది. బీజేపీ లాజిక్‌తో మిగతా వర్గాలు ఎస్పీకి దూరమయ్యాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్పీలు కూడా వైఫల్యం చెందడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయాయి. 4. బీజేపీ వైపే జాట్, బ్రహ్మణ వర్గాలు.. యూపీలో గెలుపు, ఓటమిని డిసైడ్ చేసేది జాట్, బ్రహ్మణ వర్గాలే. అయితే, రైతు చట్టాల రద్దు సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా జాట్లు పోరాటం చేశారు. ఈ క్రమంలో జాట్లు రెండుగా చీలిపోయారు. ఓ వర్గం బీజేపీకి అనుకూలంగా మారడంతో ఓట్లు చీలిపోయాయి. చెరుకు పండించే జాట్ రైతులు, బ్రహ్మణులు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గారు. దీంతో ఎస్పీకి ఓటు బ్యాంకు చీలిపోయింది. 5. ఫలించని మేనిఫెస్టో.. ఎన్నికల సందర్భంగా ఎస్పీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు వరాలు ప్రకటించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఉచిత 2 గ్యాస్ సిలిండర్లు, బాలికలకు కేజీ టూ పీజ్ఉచిత విద్య, ప్రతి జిల్లాలో మోడల్ స్కూల్స్ నిర్మాణం, 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని ప్రకటించిన ఓటర్లు ప్రభావితం కాలేదు. -
కేజ్రీవాల్‌కు మద్దతుగా మాయా, అఖిలేష్
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా పోటీచేస్తున్న ఎస్పీ-బీఎస్పీ పార్టీలు జాతీయ స్థాయిలో కూడా తమ ఓటు బ్యాంక్‌ను చీలకుండా పథకాలు రచిస్తున్నాయి. కొన్ని స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తూ.. మరికొన్ని చోట్ల భావసారూప్యత కలిగిన పార్టీలకు మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలో రెండు చోట్ల అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. మిగతా స్థానాల్లో బీఎస్పీకి తాము మద్దతు ఇవ్వనున్నట్టు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆదేశాల మేరకు తాము బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు ఎస్పీ ఢిల్లీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ యాదవ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి విజయం కోసం ఉమ్మడిగా పనిచేస్తామని తెలిపారు. న్యూఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ స్థానాల్లో మేము ఆప్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని యాదవ్ తెలిపారు. అక్కడ బీఎస్పీ అభ్యర్థులను పోటీలో ఉంచకూడదని ఆ పార్టీ నిర్ణయించినందున ఆప్ గెలుపుకోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. బీఎస్పీ తరపున సంజయ్ గెహ్లాట్ (ఈస్ట్ ఢిల్లీ), రాజ్వీర్ సింగ్ (నార్త్ ఈస్ట్ ఢిల్లీ), సీతా శరణ్ (వెస్ట్ ఢిల్లీ), షాహీద్ అలీ (చాందినీ చౌక్), సిద్ధాంత గౌతమ్ (సౌత్ ఢిల్లీ) పోటీచేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని మొదటి నుంచి వార్తలు వినిపించినా.. చివరుకు రెండు పార్టీలు ఒంటరిగానే బరిలో నిలవాలని నిర్ణయించాయి. విపక్షాలు విడివిడిగా పోటీకి దిగడంతో విజయంపై బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. -
సుప్రీంకోర్టులో ములాయం కుటుంబానికి చుక్కెదురు
న్యూఢిల్లీ: ములాయం సింగ్ కుటుంబానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారులు అఖిలేష్ యాదవ్, ప్రతీక్ యాదవ్‌లకు ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో వ్యతిరేకంగా నమోదైన అభియోగాలను దర్యాప్తు నివేదికలో పొందుపరచాలని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన బెంచ్, ప్రస్తుత దర్యాప్తు పత్రాలతో సహ దీనికి సంబంధించిన మరింత సమాచారాన్నిసేకరించి రెండు వారాల్లో సీబీఐ తమ బాధ్యతను నిర్వహించాలని సూచించింది. కేసు దర్యాప్తును కోర్టుకు అప్పగించాలని సీబీఐని ఆదేశించింది. కాంగ్రెస్ నేత విశ్వనాథ్ చతుర్వేది వేసిన పిటిషన్‌ను విచారించిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. -
అఖిలేష్‌కు షాకిచ్చిన ఎస్పీ ఎమ్మెల్యే
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్‌లో కూటమిగా పోటీచేస్తున్నట్లు మాయావతి, అఖిలేష్ ప్రకటించి కొన్ని గంటలు కూడా గడవకముందే ఎస్పీ ఎమ్మెల్యే కూటమికి షాకిచ్చారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి యూపీలో వర్కౌట్ కాదని ఎస్పీ ఎమ్మెల్యే హరిఓం యాదవ్ అన్నారు. మాయావతి చెప్పిన ప్రతి దానికి అఖిలేష్ తలొగ్గి ఉన్నంత వరకు మాత్రమే పొత్తు కొసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఎస్పీ, బీఎస్పీ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. యూపీలోని సిర్సాగంజ్ శాసన సభ్యుడైన హరిఓం యాదవ్ ఇలా అన్నారు. ‘‘కూటమి కోసం మాయావతి చెప్పిన విధంగా అఖిలేష్ వింటున్నారు. వీరి పొత్తుపై కొందరు ఎస్పీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఫిరోజాబాద్ లోక్‌సభ పరిధిలో కూటమి అస్సలు ఫలించదు. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఎస్పీ, బీఎస్పీ ప్రత్యుర్థులుగా తలపడుతున్నాయి’’ అంటూ ఎస్పీ చీఫ్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. హరిఓం ప్రాతినిథ్యం వహిస్తున్న సిర్సాగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం ఫిరోజాబాద్ లోక్‌సభ పరిధిలోనిది. ఓవైపు బీజేపీని ఓడిస్తామని ధీమాతో ఉండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఎస్పీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి ఎదుర్కొనే లక్ష్యంతో దశాబ్దాల వైరుధ్యాన్ని పక్కన పెట్టి ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రకటన కూడా విడుదల కాకముందే సొంతపార్టీ ఎమ్మెల్యేనే ఇలా వ్యాఖ్యానించడం ఎస్పీ నేతలకు మింగుడుపడటం లేదు. ఎస్పీ, బీఎస్పీ.. చెరో 38 -
ఎస్పీ, బీఎస్పీ కూటమిపై మమత..
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్పీ, బీఎస్పీల మధ్య కుదిరిన సీట్లు ఒప్పందంపై ఎన్డీయేతర పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాయవతి, అఖిలేష్ యాదవ్‌ల చారిత్రక ప్రకటనను స్వాగతిస్తున్నట్లు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా వారికి అభినందనలు తెలిపారు. అలాగే ఆర్జేడీ నేత, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ కూడా మాయా,యాదవ్ కూటమిపై స్పందించారు. యూపీలో ఏర్పడిన కూటమితోనే బీజేపీ పథనం ప్రారంభమవుతుందంటూ తేజస్వీ వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓటమే లక్ష్యంగా దశాబ్ధాల వైరుధ్యాన్ని పక్కన్న పెట్టి ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీనిపై వారు వివరణ ఇస్తూ చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు శనివారం ఉమ్మడి ప్రకటన ద్వారా ప్రకటించారు. ముందునుంచి అనుకున్న విధంగానే కాంగ్రెస్‌కు కూటమిలో స్థానం కల్పించలేదు. కానీ ప్రస్తుతం రాహుల్, సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి, రాయబరేలి స్థానాలను వారికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాగా 26ఏళ్ల అనంతరం ఎస్పీ,బీఎస్పీలు చేతులుకపడం విశేషం. ఎస్పీ- బీఎస్పీ పొత్తు ఖరారు I welcome the alliance of the SP and the BSP for the forthcoming Lok Sabha elections — Mamata Banerjee (@MamataOfficial) January 12, 2019 -
యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏమయ్యాయి..?
సాక్షి,న్యూఢిల్లీ: ఆగ్రా ఫతేపూర్ సిక్రీలో విదేశీ దంపతులపై జరిగిన దాడిని యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఖండించారు. యూపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే యోగి ఆధిత్యానాథ్ ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్వ్కాడ్స్ ఏమయ్యాయని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఫతేపూర్ సిక్రీని సందర్శించిన జంట అక్కడ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా వారిపై దాడులు జరిగాయని అఖిలేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా యాంటీ రోమియో బృందాలు ఏం చేస్తున్నాయని అఖిలేష్ నిలదీశారు. కాగా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. యూపీ సర్కార్‌ను దీనిపై నివేదిక కోరానని, దుండగుల దాడిలో గాయపడ్డ స్విస్ దంపతులను తమ మంత్రిత్వ శాఖ అధికారలు పరామర్శిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. స్విస్ దంపతులపై దాడి ఘటనకు సంబంధించి నలుగురు దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఘటనకు బాధ్యుడైన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
6న అఖిలేష్‌ను కలవనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 6న లక్నో వెళ్లనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను ఆయన కలవనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని యూపీ సీఎంను జగన్ కోరనున్నారు. లక్నో వెళ్లేందుకు జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు అనుమతి మంజూరు చేసింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడంలో భాగంగా జగన్ రేపు చెన్నైకు వెళ్లనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆయన కలుస్తారు. చెన్నై వెళ్లడానికి సోమవారం కోర్టు అనుమతిచ్చింది. జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడను 5న (గురువారం) బెంగళూరులో కలిసేందుకు అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.