లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇదేసమయంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇవ్వకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన స్నేహితుడు వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది.
యూపీలోని పిలిభిత్ స్థానానికి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇక్కడి నుంచి సమాజ్‌వాదీ పార్టీ వరుణ్‌గాంధీని బరిలోకి దింపవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వరుణ్ గాంధీకి ఇక్కడి టిక్కెట్ ఇస్తారనే ఊహాగానాలకు ఈ సమావేశం మరింత బలాన్నిచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, నామినేషన్ల దాఖలుకు మార్చి 27 చివరి తేదీ. నామినేషన్ పత్రాల పరిశీలన తేదీ మార్చి 28. నామినేషన్ల ఉపసంహరణ తేదీ ఏప్రిల్ 30. ఎన్నికల తేదీ ఏప్రిల్ 19. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment