
సైకిల్ యాత్రపై భారత్‌కు వచ్చిన ఇరాన్ దంపతులను తిరిగి వారి దేశానికి తిరిగి పంపేందుకు యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్‌పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆర్థిక సాయం అందించారు. ఈ ఇరాన్ దంపతులు ప్రపంచ శాంతి సందేశాన్ని ఇస్తూ, సైకిల్‌పై భారతదేశానికి వచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌పారం ఎక్స్‌లో అఖిలేష్ యాదవ్ ఈ వివరాలను తెలియజేస్తూ మానవత్వం కంటే గొప్ప మతం లేదని, సహాయానికి మించిన ఆరాధన లేదని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి వచ్చి, మన దేశంలో చిక్కుకుపోయిన ఈ అతిథుల కోసం ఏదో ఒకటి చేయడమనేది తన అదృష్టం అని అఖిలేష్ అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా.. ఈ జంట తిరుగు ప్రయాణపు టికెట్ రద్దయింది. వారి దగ్గర డబ్బలు కూడా లేవు. ఈ విషయాన్ని పార్టీ నేత ఒకరు అఖిలేష్ యాదవ్‌కు తెలియజేశారు. దీంతో ఈ జంటకు అఖిలేష్ సాయం అందించారు. ఈ జంటను వారి దేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ కన్నుమూత!
इंसानियत से बड़ा धर्म और मदद से बड़ी इबादत कोई और नहीं, कुछ और नहीं।
— Akhilesh Yadav (@yadavakhilesh) October 27, 2023
जंग के हालातों की वजह से, ईरान से आकर हमारे देश में फँसे इन मेहमानों की देश वापसी में हम कुछ कर पा रहे हैं, ये हमारी ख़ुशक़िस्मती है।
देश की छवि दुनिया में सिर्फ़ कहने से नहीं, कुछ अच्छा करने से बनती है। pic.twitter.com/RtvlRmhaci
Comments
Please login to add a commentAdd a comment