
అఖిలేష్ యాదవ్ థ్యాంక్స్ : జయలలిత
టీనగర్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు రాష్ట్ర సీఎం జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. చెన్నై ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతినడంతో రాష్ట్రానికి పలువురు ఆర్థికసాయాన్ని అందజేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తమిళనాడుకు రూ.25 కోట్ల రూపాయల నిధులను అందజేస్తూ ప్రకటన విడుదల చేశారు.
దీంతో ముఖ్యమంత్రి జయలలిత అఖిలేష్ యాదవ్‌కు తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె రాసిన లేఖలో ఈ విధంగా తెలిపారు. రాష్ట్రంలో వరద నివారణ పనులు వేగవంతంగా జరుగుతున్న స్థితిలో ఇందుకు సాయపడే విధంగా తమరు అమూల్యమైన నిధిగా రూ.25 కోట్లు కేటాయించి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు.