లక్నో: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా సరిహద్దు జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తీసుకెళ్లేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 1,000 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి శనివారం తెలిపారు. నోయిడా, ఘజియాబాద్, బులంద్‌షహార్, అలీఘర్ తదితర ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులకు తాగునీరు, ఆహారం వంటి సదుపాయాలు కల్పించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం అర్థరాత్రి జరిపిన సమీక్షలో సీఎం వలస కార్మికుల కోసం బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించగానే రవాణాశాఖ అధికారులు డ్రైవర్లు, కండక్టర్లతో సంప్రదించినట్లు అధికారి తెలిపారు. దీంతో లక్నోలోని చార్‌బాగ్ బస్‌స్టేషన్‌కు చేరుకున్న రాష్ట్ర డీజీపీ హితేష్ చంద్ర అవస్థీ, లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ కుమార్ పాండే వలస కార్మికుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ ఈనెల 24న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment