దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ చదువుకోవాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. మెట్రో, వైద్య ఆరోగ్య రంగాలలో ప్రగతి సాధించవలసి ఉందని చెప్పారు. యూపీలో లా అండ్ ఆర్డర్ సక్రమంగానే ఉన్నట్లు తెలిపారు. రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సందర్భం కాదన్నారు. అఖిల భారత యాదవ మహాసభకు హాజరుకావడం సంతోషంగా ఉందని చెప్పారు. హైదరాబాద్లోని ఆత్మీయులను కలిసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని పోవడం వల్లే యూపీలో విజయం సాధించినట్లు తెలిపారు. పార్టీల వారీగా వేరుగా ఉన్నా యాదవులు అనే సరికి అందరం ఏకమవుదాం అన్నారు. యాదవులు అన్ని రంగాల్లో ముందున్నారని చెప్పారు. ఇక్కడి భోజనం ఎంతో రుచికరంగా ఉందన్నారు. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టం అని అఖిలేష్ చెప్పారు.
Published Sun, Jul 21 2013 3:41 PM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement