లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన నియోజకవర్గం వారణాసిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని రెండు భారీ జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. 34 కిలోమీటర్ల పరిధిలో రూ 1571 కోట్లతో వీటిని నిర్మించారు. వారణాసి రింగ్ రోడ్డు తొలి దశను 16.55 కిలోమీటర్లలో రూ 759.36 కోట్లతో చేపట్టారు. రూ 812 కోట్లతో 17 కిలోమీటర్ల పొడవైన బబత్‌పూర్-వారణాసి రోడ్డును 56వ నెంబర్ జాతీయ రహదారిపై పూర్తిచేసినట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఇక కేంద్ర ప్రభుత్వ జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్టులో భాగంగా గంగా నదిపై మల్టీ మోడల్ వాటర్‌వేస్ టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. పర్యావరణ హితంగా సరుకుల రవాణాను అభివృద్ధి చేసే క్రమంలో నిర్మించిన ఈ ప్రాజెక్టును ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపడుతోంది. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని వెంట యూపీ గవర్నర్‌రామ్ నాయక్, సీఎం యోగి ఆదిత్యానాథ్ పలువురు కేంద్ర మంత్రులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment