
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు ఎం. అంజన్‌కుమార్ యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ మహ్మద్‌గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణలో నియంతలా వ్యవహరిస్తూ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నగరంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి పార్టీ పటిష్టత కోసం తగిన ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. తన నివాసానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి అంతకుముందు అంజన్‌కుమార్ యాదవ్ ఘన స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment