
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అరవింద్ కూడా ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ స్పందిస్తూ..‘‘ నా కుమారుడు బర్త్ డే పార్టీకి వెళ్లాడు. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తే అభాండాలు వేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మా కుటుంబం అలాంటిది కాదు. దీనిలో నిజానిజాలు తేల్చాలి. సిటీలో ఉన్న అన్ని పబ్‌లను మూసివేయాలి. మద్యపాన నిషేధం విధించాలి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment