pub mafia
-
Hyderabad: పబ్‌లో డ్రగ్స్ కలకలం
గచ్చిబౌలి: ఎలక్ట్రికల్ మ్యూజిక్ అంటేనే హై హోల్టేజీ సౌండ్ ఉంటుంది. ఆ మ్యూజిక్‌ను వినాలంటే మామూలుగానైతే కర్ణబేరి బద్దలైనట్లు ఉంటుంది. కాని డ్రగ్స్ తీసుకున్న వారు ఆ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే తరహలో సైబరాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఖాజాగూడలోని ద కేవ్ పబ్‌లో ‘ఫారెస్ట్ సైకెడలిక్ పార్టీ’ని నిర్వహించారు. డ్రగ్స్ సేవించి పార్టీలో పాల్గొన్నారని సమాచారం అందడంతో సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ నార్కొటిక్ బ్యూరో శనివారం రాత్రి ఖాజాగూడలోని ఎస్వీ ఆర్కెడ్ లోని నాల్గవ అంతస్తులో ఉన్న ‘ద కేవ్ పబ్‌పై మెరుపు దాడి చేసింది. పార్టీలో పాల్గొన్న వారందరికీ మెడికల్ టెస్ట్‌లు నిర్వహించారు. 24 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆదివారం గచ్చిబౌలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కేసు వివరాలను వెల్లడించారు. రాత్రి 10.30 గంటల సమయంలో నార్కొటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా కేవ్ పబ్‌పై దాడి చేశారని తెలిపారు. పారీ్టలో పాల్గొన్న, హోటల్లో పని చేస్తున్న 55 మందిని అదుపులోకి తీసుకొని టెస్ట్ చేయగా 24 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. పలు మల్టీ నేషనల్ కంపెనీలలో పని చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఉన్నారని చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారితో పాటు కేవ్ పబ్ మేనేజర్ బెంగళూర్‌కు చెందిన సందీప్ శర్మ(44)ను అరెస్ట్ చేశామన్నారు. పబ్ యజమానులు రాజేష్, అభినవ్, సాయి కృష్ణ, సన్నీలు పరారీలో ఉన్నారని వివరించారు. సైకెడలిక్ పార్టీ ఆర్గనైజర్, డీజే ఆపరేటర్ న్యూ మల్లెపల్లికి చెందిన అబ్ధుల్ అయూబ్(24) ఇన్‌స్ట్రాగామ్‌లో సైకెడలిక్ పార్టీ ఉన్నట్లు ప్రచారం చేశారన్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు బృందాలు వేర్వేచు చోట్ల గంజాయి, కొకైన్ , ఎండీఎంఏ సేవించి వచి్చనట్లు గుర్తించినట్లు తెలిపారు. 17 మంది గాంజా, ఇద్దరు కొకైన్, గాంజా, నలుగురు ఎండీఎంఏ, గాంజా, ఒకరు ఎండీఎంఏ సేవించినట్లు డీసీపీ తెలిపారు. గాంజా, ఎండీఎంఏ, కొకైన్ ఎక్కడ సేవించారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే అంశాలపై సమగ్ర విచారణ చేయాల్సి ఉందన్నారు. నార్కొటిక్ బ్యూరో డీఎస్పీ సీహెచ్.శ్రీధర్ , టాస్‌్కఫోర్స్ డీఎస్పీ టి.శ్రీనివాస్, ఏడీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్, ఇన్స్పెక్టర్లు దాలినాయుడు, సంజయ్, సీహెచ్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పబ్‌లపై చర్యలు తప్పవు డ్రగ్ సేవించే వారి కోసం పార్టీలు నిర్వహిస్తే పబ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ హెచ్చరించారు. ర్యాండమ్‌గా పబ్‌లలో తనిఖీలు చేస్తామని అక్కడికక్కడే యూరిన్ కిట్ల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పాజిటివ్‌గా తేలితే సంబంధిత వ్యక్తులపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు. మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు, వాడుతున్నట్లు సమాచారం 8712671111 ఫోన్ నెంబర్‌కు తెలియజేయాలని సూచించారు. డ్రగ్ రహిత సమాజం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.24 మందికి పాజిటివ్ ద కేవ్ పబ్ డీజే ఆపరేటర్, ఈవెంట్ ఆర్గనైజర్ మల్లెపల్లికి చెందిన అబ్ధుల్లా అయూబ్, మేనేజర్ శేఖర్ కుమార్(52), పార్టీకి వచి్చన కస్టమర్లు మహ్మద్ అడ్నన్ బారీ(23), మహ్మద్ అలీ(29), సాయి కిరణ్ బేగరీ(31), గిరిధర్ మనీష్(39), చింతమ్ పూజిత్ (24), మహేష్ చంద్ర(24), మహ్మద్ యాసిన్(22), మహ్మద్ రఫీ నిజామీ(22), సాయి ప్రణీత్(23), కంది రేగుల కిరణ్(25), నేరడుమల్లీ సందీప్(24), పోతురి వంశీ కృష్ణ(24), మహ్మద్ అర్బజ్(24), మిరాజ్ అసద్ అహ్మద్(25), మహ్మద్ సయ్యద్రజా(26), పూలపల్లి శివ(22), ఎం.డి.నవాజుద్ధీన్(29), అయలసోమయాజుల సాయి గౌరంగ్(26), ఎం.హరికృష్ణ(26), కె.మధుసూదన్(24), అనీస్ ముష్రాఫ్(39), డి.రోహిత్ వర్మ(26)లకు పాజిటివ్‌గా తేలింది. వారందరికి తదుపరి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. -
మోషే పబ్: టార్గెట్ బిజినెస్మెన్.. యువతి ఘరానా మోసం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని మోషే పబ్‌లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ యువతి ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తలను చీట్ చేసిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.కాగా, మోషే పబ్‌లో జరిగిన అక్రమాలపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘తక్షణ అనే యువతి ముగ్గురు వ్యాపారవేత్తలకు టోకరా వేసింది. మోషే పబ్ మేనేజర్, యజమానితో కలిసి వారిని చీట్ చేసింది. పబ్‌లో లిక్కర్ తాగినట్టుగా నటించి ఏకంగా వేల రూపాయల బిల్లు వేయించింది. అనంతరం, ప్లాన్ ప్రకారం బిల్లులో నుంచి తన కమీషన్ తాను తీసుకుంది. ఇలా వ్యాపారులను బోల్తా కొట్టించింది. వారి నుంచి లక్షన్నర రూపాయలు కాజేసింది.ఇక, ఈ పబ్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు 10 మందిపై కేసు నమోదు చేయగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. మోషే పబ్ ముగ్గురు యజమానులతో పాటు.. మేనేజర్‌పైనా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. సదరు యువతి తక్షణ టిండర్ యాప్ ద్వారా వ్యాపారవేత్తలను ట్రాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరంతా నాగపూర్‌కు చెందిన గ్యాంగ్ అని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ కేసులో భాగంగా వ్యాపారవేత్తలకు వలవేస్తున్న యువతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
Banjara Hills: యువతులను ఎరగా వేసి..
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని ఆఫ్టర్ 9 పబ్‌లో సాగుతున్న చీకటి వ్యాపారం గుట్టును వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు రట్టుచేశారు. శనివారం రాత్రి ఆఫ్టర్ 9 పబ్‌కు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు వచ్చారనే సమాచారంతో దాడులు చేశారు. పబ్ లోపలికి జంటలకు మాత్రమే అనుమతి ఉండగా.. ఇక్కడకు వస్తున్న యువకులకు, యువతులకు ఎలాంటి సంబంధాలు లేవని గుర్తించారు. ఇక్కడికి వచ్చే యువకులకు తాను అద్దెకు తీసుకువచ్చిన యువతులను పబ్ యజమాని ఎరగా వేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో పబ్ యజమాని బరిదక సతీష్, భవన యజమాని విద్యాధర మూర్తి, పబ్ మేనేజర్ కోరాడ శ్రీనివాసరావు, డీజే నిర్వాహకుడు అజ్మత్‌ఖాన్, క్యాషియర్ శ్రీనివాసరావు, అయిదుగురు బౌన్సర్లు సాయితేజ, మహేష్, కిషోర్, వినీల్, శేఖర్లతో పాటు 131 మంది యువకులు, 32 మంది యువతులను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలు బేఖాతరు చేసిన ఆఫ్టర్ 9 పబ్ లైసెన్స్‌ను రద్దు చేయాల్సిందిగా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నందున ఈ బిల్డింగ్‌ను సీజ్ చేయాలని సికింద్రాబాద్ ఆర్డీఓకు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. -
డ్రగ్స్ కేసులో అంజన్ కుమార్ కొడుకు.. ఆయన కామెంట్స్ ఇవే..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అరవింద్ కూడా ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ స్పందిస్తూ..‘‘ నా కుమారుడు బర్త్ డే పార్టీకి వెళ్లాడు. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తే అభాండాలు వేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మా కుటుంబం అలాంటిది కాదు. దీనిలో నిజానిజాలు తేల్చాలి. సిటీలో ఉన్న అన్ని పబ్‌లను మూసివేయాలి. మద్యపాన నిషేధం విధించాలి’’ అని అన్నారు. -
సేనను నిషేధించడం వెనుక ఉద్దేశమేంటి?
పనాజి: వివాదస్పద హిందూ సంస్థ శ్రీరామసేనను గోవాలో నిషేధించడాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ తప్పుబట్టారు. డ్రగ్ లార్డ్స్, పబ్ మాఫియా ఆదేశాల మేరకు తమ సంస్థను నిషేధించారని ఆయన ఆరోపించారు. గోవాలో శ్రీరామసేనను నిషేధించడం వెనుక ఉద్దేశమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అసలు శ్రీరామసేన లేదని, ఒక్క సభ్యుడు ఇందులో లేరని ఆయన వెల్లడించారు. గోవాలో తాము ఏమైనా దాడులు చేశామా అని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులను రాష్ట్రంలోకి అనుమతిస్తూ, దేశభక్తులపై నిషేధం విధిస్తారా అని నిలదీశారు. నిషేధం ఎత్తివేత కోసం కోర్టును ఆశ్రయిస్తామని ముతాలిక్ చెప్పారు. శ్రీరామసేనను నిషేధిస్తున్నట్టు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ శాసనసభలో బుధవారం ప్రకటన చేశారు.