పబ్ ముసుగులో చీకటి వ్యాపారం
ఆఫ్టర్ 9 పబ్‌పై పోలీసుల దాడులు
173 మందిపై కేసు నమోదు
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని ఆఫ్టర్ 9 పబ్‌లో సాగుతున్న చీకటి వ్యాపారం గుట్టును వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు రట్టుచేశారు. శనివారం రాత్రి ఆఫ్టర్ 9 పబ్‌కు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు వచ్చారనే సమాచారంతో దాడులు చేశారు. పబ్ లోపలికి జంటలకు మాత్రమే అనుమతి ఉండగా.. ఇక్కడకు వస్తున్న యువకులకు, యువతులకు ఎలాంటి సంబంధాలు లేవని గుర్తించారు. ఇక్కడికి వచ్చే యువకులకు తాను అద్దెకు తీసుకువచ్చిన యువతులను పబ్ యజమాని ఎరగా వేస్తున్నట్లుగా గుర్తించారు.
దీంతో పబ్ యజమాని బరిదక సతీష్, భవన యజమాని విద్యాధర మూర్తి, పబ్ మేనేజర్ కోరాడ శ్రీనివాసరావు, డీజే నిర్వాహకుడు అజ్మత్‌ఖాన్, క్యాషియర్ శ్రీనివాసరావు, అయిదుగురు బౌన్సర్లు సాయితేజ, మహేష్, కిషోర్, వినీల్, శేఖర్‌లతో పాటు 131 మంది యువకులు, 32 మంది యువతులను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలు బేఖాతరు చేసిన ఆఫ్టర్ 9 పబ్ లైసెన్స్‌ను రద్దు చేయాల్సిందిగా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నందున ఈ బిల్డింగ్‌ను సీజ్ చేయాలని సికింద్రాబాద్ ఆర్డీఓకు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment