Hyderabad: పబ్‌లో డ్రగ్స్‌ కలకలం | Hyderabad: 24 Persons Caught Consuming Drugs in Surprise Raid at Cave Pub | Sakshi
Sakshi News home page

Hyderabad: పబ్‌లో డ్రగ్స్‌ కలకలం

Published Mon, Jul 8 2024 7:42 AM | Last Updated on Mon, Jul 8 2024 7:48 AM

Hyderabad: 24 Persons Caught Consuming Drugs in Surprise Raid at Cave Pub

ద కేవ్‌ పబ్‌పై పోలీసుల దాడి..  24 మందికి డ్రగ్‌ పాజిటివ్‌

గచ్చిబౌలి: ఎలక్ట్రికల్‌ మ్యూజిక్‌ అంటేనే హై హోల్టేజీ సౌండ్‌  ఉంటుంది. ఆ మ్యూజిక్‌ను వినాలంటే మామూలుగానైతే కర్ణబేరి బద్దలైనట్లు ఉంటుంది. కాని డ్రగ్స్‌ తీసుకున్న వారు ఆ మ్యూజిక్‌ను ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇదే తరహలో సైబరాబాద్‌ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఖాజాగూడలోని ద కేవ్‌ పబ్‌లో ‘ఫారెస్ట్‌ సైకెడలిక్‌ పార్టీ’ని నిర్వహించారు. డ్రగ్స్‌ సేవించి పార్టీలో పాల్గొన్నారని సమాచారం అందడంతో సైబరాబాద్‌ పోలీసులు, తెలంగాణ నార్కొటిక్‌ బ్యూరో శనివారం రాత్రి ఖాజాగూడలోని ఎస్‌వీ ఆర్కెడ్‌ లోని నాల్గవ అంతస్తులో ఉన్న ‘ద కేవ్‌ పబ్‌పై  మెరుపు దాడి చేసింది. పార్టీలో పాల్గొన్న వారందరికీ మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించారు. 

24 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆదివారం గచ్చిబౌలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదాపూర్‌ డీసీపీ డాక్టర్‌ వినీత్‌ కేసు వివరాలను వెల్లడించారు. రాత్రి 10.30 గంటల సమయంలో నార్కొటిక్‌  బ్యూరో, ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా కేవ్‌ పబ్‌పై దాడి చేశారని తెలిపారు. పారీ్టలో పాల్గొన్న, హోటల్‌లో పని చేస్తున్న 55 మందిని అదుపులోకి తీసుకొని టెస్ట్‌ చేయగా 24 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. 

పలు మల్టీ నేషనల్‌ కంపెనీలలో పని చేసే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఉన్నారని చెప్పారు. పాజిటివ్‌ వచ్చిన వారితో పాటు కేవ్‌ పబ్‌ మేనేజర్‌ బెంగళూర్‌కు చెందిన సందీప్‌ శర్మ(44)ను అరెస్ట్‌ చేశామన్నారు. పబ్‌ యజమానులు రాజేష్, అభినవ్, సాయి కృష్ణ, సన్నీలు పరారీలో ఉన్నారని వివరించారు. సైకెడలిక్‌ పార్టీ ఆర్గనైజర్, డీజే ఆపరేటర్‌ న్యూ మల్లెపల్లికి చెందిన అబ్ధుల్‌ అయూబ్‌(24) ఇన్‌స్ట్రాగామ్‌లో సైకెడలిక్‌ పార్టీ ఉన్నట్లు ప్రచారం చేశారన్నారు. 

దీంతో  వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు బృందాలు వేర్వేచు చోట్ల గంజాయి, కొకైన్‌ , ఎండీఎంఏ సేవించి వచి్చనట్లు గుర్తించినట్లు తెలిపారు.  17 మంది గాంజా, ఇద్దరు కొకైన్, గాంజా, నలుగురు ఎండీఎంఏ, గాంజా, ఒకరు ఎండీఎంఏ సేవించినట్లు డీసీపీ తెలిపారు. గాంజా, ఎండీఎంఏ, కొకైన్‌ ఎక్కడ సేవించారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే అంశాలపై సమగ్ర విచారణ చేయాల్సి ఉందన్నారు. నార్కొటిక్‌ బ్యూరో డీఎస్‌పీ సీహెచ్‌.శ్రీధర్‌ , టాస్‌్కఫోర్స్‌ డీఎస్‌పీ టి.శ్రీనివాస్, ఏడీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్,  ఇన్‌స్పెక్టర్లు దాలినాయుడు, సంజయ్, సీహెచ్‌.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.  

పబ్‌లపై చర్యలు తప్పవు 
డ్రగ్‌ సేవించే వారి కోసం పార్టీలు నిర్వహిస్తే పబ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ హెచ్చరించారు. ర్యాండమ్‌గా పబ్‌లలో తనిఖీలు చేస్తామని అక్కడికక్కడే యూరిన్‌ కిట్ల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పాజిటివ్‌గా తేలితే సంబంధిత వ్యక్తులపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు. మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు, వాడుతున్నట్లు సమాచారం 8712671111 ఫోన్‌ నెంబర్‌కు తెలియజేయాలని సూచించారు. డ్రగ్‌ రహిత సమాజం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

24 మందికి పాజిటివ్‌ 
ద కేవ్‌ పబ్‌ డీజే ఆపరేటర్, ఈవెంట్‌ ఆర్గనైజర్‌ మల్లెపల్లికి చెందిన అబ్ధుల్లా అయూబ్, మేనేజర్‌ శేఖర్‌ కుమార్‌(52), పార్టీకి వచి్చన కస్టమర్లు మహ్మద్‌ అడ్నన్‌ బారీ(23), మహ్మద్‌ అలీ(29), సాయి కిరణ్‌ బేగరీ(31), గిరిధర్‌ మనీష్‌(39), చింతమ్‌ పూజిత్‌ (24), మహేష్‌ చంద్ర(24), మహ్మద్‌ యాసిన్‌(22), మహ్మద్‌ రఫీ నిజామీ(22), సాయి ప్రణీత్‌(23), కంది రేగుల కిరణ్‌(25), నేరడుమల్లీ సందీప్‌(24), పోతురి వంశీ కృష్ణ(24), మహ్మద్‌ అర్బజ్‌(24), మిరాజ్‌ అసద్‌ అహ్మద్‌(25), మహ్మద్‌ సయ్యద్‌రజా(26), పూలపల్లి శివ(22), ఎం.డి.నవాజుద్ధీన్‌(29), అయలసోమయాజుల సాయి గౌరంగ్‌(26), ఎం.హరికృష్ణ(26), కె.మధుసూదన్‌(24), అనీస్‌ ముష్రాఫ్‌(39), డి.రోహిత్‌ వర్మ(26)లకు పాజిటివ్‌గా తేలింది. వారందరికి తదుపరి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement