హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం.. హీరోయిన్‌ రకుల్‌ సోదరుడు అరెస్ట్‌! | Drugs In Hyderabad, Police Seized Cocaine At Cyberabad, Rakul Preet Singh Brother Arrested | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం.. హీరోయిన్‌ రకుల్‌ సోదరుడు అరెస్ట్‌!

Published Mon, Jul 15 2024 3:26 PM | Last Updated on Mon, Jul 15 2024 5:07 PM

Drugs In Hyderabad: Police Seized cocaine At Cyberabad Celebrity arrest

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. డ్రగ్స్‌ అమ్ముతున్న అయిదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 2 కోట్లకు పైగా విలువైన 200 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయిదుగురు నైజీరియన్లతోపాటు వారి నుంచి డ్రగ్స్‌  కొనుగోలు చేసిన అయిదుగురు ప్రముఖులను అరెస్ట్‌ చేశారు. పోలీసుల అదుపులో సీని రంగ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. 

నైజీరియన్‌ నుంచి వీరంతా డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ పట్టివేతపై కాసేపట్లో రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడనున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement