
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని మోషే పబ్‌లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ యువతి ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తలను చీట్ చేసిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
కాగా, మోషే పబ్‌లో జరిగిన అక్రమాలపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘తక్షణ అనే యువతి ముగ్గురు వ్యాపారవేత్తలకు టోకరా వేసింది. మోషే పబ్ మేనేజర్, యజమానితో కలిసి వారిని చీట్ చేసింది. పబ్‌లో లిక్కర్ తాగినట్టుగా నటించి ఏకంగా వేల రూపాయల బిల్లు వేయించింది. అనంతరం, ప్లాన్ ప్రకారం బిల్లులో నుంచి తన కమీషన్ తాను తీసుకుంది. ఇలా వ్యాపారులను బోల్తా కొట్టించింది. వారి నుంచి లక్షన్నర రూపాయలు కాజేసింది.
ఇక, ఈ పబ్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు 10 మందిపై కేసు నమోదు చేయగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. మోషే పబ్ ముగ్గురు యజమానులతో పాటు.. మేనేజర్‌పైనా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. సదరు యువతి తక్షణ టిండర్ యాప్ ద్వారా వ్యాపారవేత్తలను ట్రాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరంతా నాగపూర్‌కు చెందిన గ్యాంగ్ అని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ కేసులో భాగంగా వ్యాపారవేత్తలకు వలవేస్తున్న యువతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment