కాంగ్రెస్‌లో లొల్లి, అలిగిన అంజన్‌కుమార్‌‌?! | GHMC Elections 2020 Congress Party City In Charge Anjan Kumar Yadav Angry Over Party | Sakshi
Sakshi News home page

అలిగిన సిటీ ఇంచార్జ్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌?!

Published Wed, Nov 18 2020 11:00 AM | Last Updated on Wed, Nov 18 2020 11:45 AM

GHMC Elections 2020 Congress Party City In Charge Anjan Kumar Yadav Angry Over Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక ఉపఎన్నికలో దుమ్ములేపాలని భావించిన కాంగ్రెస్ పార్టీ‌.. మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గట్టిగా కొట్లాడదామని భావిస్తే.. నాయకులు ఒక్కొక్కరుగా ‘హస్తా’నికి హ్యాండ్‌ ఇస్గున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌, శేరిలింగంపల్లి ఇన్‌ఛార్జ్‌ రవికుమార్‌యాదవ్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నగర‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ కూడా అలిగినట్లు సమాచారం. గాంధీభవన్‌లో జరిగిన ఎన్నికల సమావేశానికి అంజన్‌ కుమార్‌ డుమ్మాకొట్టారు. తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్లు కేటాయిస్తున్నారని అధిష్టానంపై అంజన్‌ కుమార్‌ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌, రవికుమార్‌ యాదవ్‌ బీజేపేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆశావహులకు బీజేపీ ఎర.. కాంగ్రెస్‌ దూకుడు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement