అంతమాత్రానికే సభాహక్కుల నోటీసా: వీహెచ్
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని, చర్చ మాత్రమే ఉంటుందని దిగ్విజయ్ చెప్పడానికి ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవమే కారణమని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. అంతమాత్రానికే టీడీపీ ఎమ్మెల్యేలు దిగ్విజయ్ సింగ్పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం సరికాదని ఆయన చెప్పారు.
గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడును లౌకికవాదులంటే ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. టీడీపీ-బీజేపీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా వాటికి ఆశించిన ఫలితం దక్కదని వీహెచ్ జోస్యం చెప్పారు.