'బాబూ.. నీ సొంత తప్పును ప్రజలపై రుద్దొద్దు' | that mistake was done by chandrababu only: roja | Sakshi
Sakshi News home page

'బాబూ.. నీ సొంత తప్పును ప్రజలపై రుద్దొద్దు'

Published Tue, Jun 9 2015 2:41 PM | Last Updated on Tue, May 29 2018 3:49 PM

'బాబూ.. నీ సొంత తప్పును ప్రజలపై రుద్దొద్దు' - Sakshi

'బాబూ.. నీ సొంత తప్పును ప్రజలపై రుద్దొద్దు'

చిత్తూరు: వ్యక్తిగతంగా చేసిన తప్పుతో నెలకొన్న వివాదాన్ని రెండు రాష్ట్రాలకు, ప్రజలపై రుద్దొద్దని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు. రేవంత్ తీగ లాగితే చంద్రబాబు డొంకంతా కదిలిందని చెప్పారు. నిజంగా నైతిక విలువలుంటే చంద్రబాబునాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలను బెదిరించేలా మాట్లాడారని, ఇప్పుడు సభలో కూడా అలాగే మాట్లాడుతున్నారని చెప్పారు.

పార్టీ వాళ్లేమో ఆ గొంతు చంద్రబాబుది కానే కాదని అంటుంటే.. చంద్రబాబు మాత్రం ఫోన్ ట్యాపింగ్ అయిందంటున్నారని ఇందులో ఏ విషయాలు ప్రజలు నమ్మాలని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని తెలుగు ప్రజలందరికీ అపాధించడం సరికాదని చెప్పారు. ఎంసెట్, నదీజలాలు, విద్యుత్, విద్యార్థుల వివాదాలు తలెత్తినప్పుడు నోరు విప్పని చంద్రబాబునాయుడు ఇప్పుడు సొంత వ్యవహారాన్ని మాత్రం రెండు రాష్ట్రాల ప్రజలకు ముడిపెట్టి గందరగోళం రేపుతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement