ఓ నేరం గురించి చర్చకు కేబినెట్ మీటింగా? | ap cabinet neglect ap people: balka suman | Sakshi
Sakshi News home page

ఓ నేరం గురించి చర్చకు కేబినెట్ మీటింగా?

Published Tue, Jun 9 2015 4:04 PM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

ap cabinet neglect ap people: balka suman

హైదరాబాద్: ప్రజల సమస్యలు చర్చించనప్పుడు కేబినెట్ సమావేశం ఎందుకు అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. ఏపీ ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముడుపుల కేసు వ్యవహారానికి ఇంత ప్రాధాన్యం ఇస్తారా అని అన్నారు. ఓ నేరం గురించి మాట్లాడేందుకు ఏపీ కేబినెట్ సమావేశం కావాలా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముడుపుల కేసు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆడియో టేపులు బయటపడటంతో పలు రాజకీయ వర్గాలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement