చంద్రబాబుపై రాష్ట్రపతికి వైఎస్ జగన్ ఫిర్యాదు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు నోటు వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈసందర్భంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకోసం చంద్రబాబునాయుడు రూ. కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకోని చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు.