నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు బహిర్గతం కావడంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో తీవ్ర అలజడి రేగుతోంది. ఆడియో టేపుల వ్యవహారంపై ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. ఓ జెడ్ క్యాటగిరి ఉన్న సీఎం ఫోన్లను ట్యాప్ చేస్తారా?అంటూ ప్రశ్నించారు.