
సీబీఐతో విచారణ జరిపించాలి
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారం రోజు రోజుకూ మరింత ముదురుతోంది. దీనిపై అన్ని రాజకీయ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలంటూ సూచిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఓ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిని అంత తేలికగా వదిలిపెట్టకూడదని కూడా ఆయన లేఖలో సూచించినట్లు సమాచారం.