సాక్షి, హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అక్కడి పోలీసులను అభినందిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. సీఎస్‌కు గానీ, సీఎంకు గానీ సమాచారం ఇవ్వకుండా సీబీఐ అధికారులు ఒక ఐపీఎస్ అధికారి అరెస్ట్‌కు ప్రయత్నం చేయటం దారుణమని మండిపడ్డారు. ప్రజల ఓట్లతో రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన మమత ప్రభుత్వంపై నరేంద్ర మోదీ, అమిత్ షా దాడి చేయబోయారని ధ్వజమెత్తారు. మమత ఓ శక్తిలా అడ్డుకుని రాజ్యాంగాన్నీ కాపాడిందని కొనియాడారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిప్పులు చెరిగారు. ఎన్డీఏ బీటీమ్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అని వీహెచ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment