సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు నిర్మించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అభివర్ణించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలకు మద్దతు తెలపడాన్ని ఎంఐఎం మానుకోవాలని సూచించారు.
బైసన్ పోలో మైదానంలో సచివాలయం నిర్మాణానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టు తాము నిర్వహించిన తమ ప్రజాభిప్రాయ సేకరణలో తేలిందన్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ భవనం ఉండగా కొత్తది అవసరమా అని ప్రశ్నించారు. వచ్చే తరాలకు తన పేరు తెలియాలన్న స్వార్ధంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ ఆరోపించారు. కొత్త అసెంబ్లీ పేరుతో హెరిటేజ్ భవనాలు కూల్చటం దారుణమని, ఇలాంటి పిచ్చి పనులు కేసీఆర్ మానుకోవాలన్నారు. ప్రజల డబ్బు వృథా చేయటం సరికాదని, అన్నింటికన్నా ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త అసెంబ్లీని ఫంక‌్షన్ హాల్‌గా, కౌన్సిల్‌ను లైబ్రరీగా మారుస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment