Gandhi bhan
-
నీలాంటోళ్ల అంతు చూస్తాం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంజనీ కుమార్ ఐపీఎస్‌గా విధులు నిర్వర్తించడానికి పనికిరాడని, అవినీతిపరుడని, వ్యక్తిత్వం లేనివాడని, దిగజారినోడని విమర్శించారు. నీలాంటి ఓవరాక్షన్ చేసే వాళ్ల అంతు చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. శనివారం గాందీభవన్‌లో జరిగిన ‘సత్యా గ్రహ దీక్ష’సందర్భంగా జరిగిన పరిణామాలు, పోలీసుల వైఖరిపై ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజనీ కుమార్‌పై ఫైర్ అయ్యారు. ‘నిన్న, ఈ రోజు జరిగిన పరిణామాలపై నేను వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీపరంగా ఆందోళన వ్యక్తంచేస్తున్నాం. జాతీయ పార్టీగా, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా , 135 ఏళ్ల చరిత్ర గల పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా మేం ఓ ర్యాలీ నిర్వహిస్తామని కోరితే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కొందరు తొత్తులు అవమానకరంగా వ్యవహరిస్తూ మా ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారు. గాందీభవన్‌లో దీక్ష జరుగుతుంటే అందులో పాల్గొనడానికి వచ్చిన వేయి మందికి పైగా కార్యకర్తలను దీక్ష జరుగుతుండగానే నిర్బంధిస్తారా? రాష్ట్ర పోలీసు అధికారులు కేసీఆర్‌కు, ఆర్ఎస్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అంజనీ కుమార్ దిగజారిపోయాడు. మమ్మల్ని అవమానపర్చేలా మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి రోడ్లు ఖాళీ చేసి అనుమతినిస్తారా? దారుస్సలాంలో ఎంఐఎం సమావేశాలు జరిగినట్టు మేం కూడా గాం«దీభవన్‌లో దీక్ష చేస్తున్నాం. వారికి అనుమతి ఇచి్చనప్పుడు మాకెందుకు ఇవ్వరు? అంజనీ కుమార్.. నీ సంగతి చూస్తాం. ఎక్కడి నుంచో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చావు. చేసుకుని పో. నీ వైఖరిపై మేం చాలా సీరియస్‌గా ఉన్నాం. ఇలా ఓవరాక్షన్ చేసిన వారిని ఊరుకోం. అంతు చూస్తాం. ఐపీఎస్ బదులు నువ్వు కేపీఎస్ అని పెట్టుకో. ఇలాంటి చెంచాలు ఐపీఎస్‌లుగా పనికిరారు. అంజనీ చిట్టా తీసి సోమవారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఆయన్ను తొలగించాలని ఫిర్యాదు చేస్తాం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ (8) కింద హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన అధికారం గవర్నర్‌కు పదేళ్లు ఉన్నందున దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరతాం’అని ఉత్తమ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. -
‘కేసీఆర్.. పిచ్చి పనులు మానుకో’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు నిర్మించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అభివర్ణించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలకు మద్దతు తెలపడాన్ని ఎంఐఎం మానుకోవాలని సూచించారు. బైసన్ పోలో మైదానంలో సచివాలయం నిర్మాణానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టు తాము నిర్వహించిన తమ ప్రజాభిప్రాయ సేకరణలో తేలిందన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ భవనం ఉండగా కొత్తది అవసరమా అని ప్రశ్నించారు. వచ్చే తరాలకు తన పేరు తెలియాలన్న స్వార్ధంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వీహెచ్ ఆరోపించారు. కొత్త అసెంబ్లీ పేరుతో హెరిటేజ్ భవనాలు కూల్చటం దారుణమని, ఇలాంటి పిచ్చి పనులు కేసీఆర్ మానుకోవాలన్నారు. ప్రజల డబ్బు వృథా చేయటం సరికాదని, అన్నింటికన్నా ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త అసెంబ్లీని ఫంక్షన్ హాల్‌గా, కౌన్సిల్‌ను లైబ్రరీగా మారుస్తామన్నారు. -
చేప పిల్లల స్కామ్‌పై విచారణ జరపాలి
-
చేప పిల్లల స్కామ్‌పై విచారణ జరపాలి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: చెరువులలో చేపపిల్లలు వేసే పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ స్కామ్‌పై ప్రత్యేక విచారణ జరిపించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. గాంధీభన్ న్లో సోమవారం ఆయన మాట్లాడుతూ తక్కువ చేపపిల్లలు వేసి, ఎక్కువ లెక్కలు చూపించడం ద్వారా కాంట్రాక్టర్లు, అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని, యాసంగి పంట కాలంలో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయిందన్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడం, రైతు వ్యతిరేక విధానాలతో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నారని మల్లు రవి ఆరోపించారు.