
చేప పిల్లల స్కామ్‌పై విచారణ జరపాలి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: చెరువులలో చేపపిల్లలు వేసే పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఈ స్కామ్‌పై ప్రత్యేక విచారణ జరిపించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. గాంధీభన్ న్లో సోమవారం ఆయన మాట్లాడుతూ తక్కువ చేపపిల్లలు వేసి, ఎక్కువ లెక్కలు చూపించడం ద్వారా కాంట్రాక్టర్లు, అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని, యాసంగి పంట కాలంలో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయిందన్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడం, రైతు వ్యతిరేక విధానాలతో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నారని మల్లు రవి ఆరోపించారు.