స్టాళ్లను పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. చిత్రంలో మామిడి హరికృష్ణ తదితరులు
కవాడిగూడ (హైదరాబాద్): పుస్తకాలు చదవడంతోనే ప్రజలకు మంచి పరిపాలన అందించడం సాధ్యమవుతుందని, అందుకుని దర్శనమే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలన అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల వేలాది పుస్తకాలు చదివి తెలంగాణను సాధించారని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సాధనకోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజలను చైతన్య పరిచి రాష్ట్రానికి తన జీవితాన్ని అర్పించారని మంత్రి వివరించారు.
ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌కు బోనాలతో స్వాగతం పలికారు. చిందు ఎల్లమ్మ వేదికపై జరిగిన సమావేశంలో బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు ఎల్లప్పుడు పూర్తి సహకారం ఉంటుందని హామీనిచ్చారు.
గోల్కొండ పత్రికతో కవులు, రచయిత సంఖ్య తెలియజెప్పారు
నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతంలో కవులు రచయితలు లేరన్న సందర్భంలో సు రవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక నిర్వహిస్తూ తెలంగాణలో కవులు రచయితల సంఖ్యను చెప్పిన మహోన్నత వ్యక్తి అని మంత్రి గుర్తు చేశారు. నిరంతరం బుక్‌ఫెయిర్ నిర్వహించేందుకు రవీంద్రభారతిలో స్థలం కేటాయిస్తామని బుక్‌ఫెయిర్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
అనంతరం తెలంగాణ దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. గౌ రీశంకర్ మాట్లాడుతూ బుక్‌ఫెయిర్‌ను పుస్త క ప్రేమికులు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సాంస్కృతిశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment