
'సీఎం పదవికి రాజీనామా చేయాలి'
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
ప్రకాశం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన చంద్రబాబు, నేరం ఒప్పుకోకుండా ఈ వ్యవహారాన్ని ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముడుపుల వ్యవహారంలో టీఆర్ఎస్, టీడీపీకి సంబంధించిందని ఆయన తెలిపారు.