హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు చేసిన తప్పులను ఒప్పుకుని వెంటనే కోర్టు ముందు లొంగిపోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ వ్యాఖ్యానించారు. స్వయంగ చంద్రబాబే ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నట్టు రుజువైందన్నారు. ఆడియో టేపులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆడియో టేపులపై అనుమానాలు ఉంటే ఎలాంటి పరీక్షలైనా చేసుకోవచ్చని గణేష్ తెలిపారు.