phone audio tapes
-
రాజకీయ నేతతో రైతు సంభాషణ
-
చంద్రబాబును అరెస్టు చేయాలి: పొంగులేటి
-
మేమేంటో చూపిస్తాం : నన్నపనేని
-
నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి'
-
'చేసిన తప్పులను ఒప్పుకోవాలి'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు చేసిన తప్పులను ఒప్పుకుని వెంటనే కోర్టు ముందు లొంగిపోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ వ్యాఖ్యానించారు. స్వయంగ చంద్రబాబే ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నట్టు రుజువైందన్నారు. ఆడియో టేపులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆడియో టేపులపై అనుమానాలు ఉంటే ఎలాంటి పరీక్షలైనా చేసుకోవచ్చని గణేష్ తెలిపారు. -
'నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి'
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో భాగంగా నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు తనవి కావని టీడీపీ చెప్పడంపై వైఎస్సార్ సీపీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యవహారం నుంచి చంద్రబాబు బయటపడటానికి యత్నిస్తూ ఎదురుదాడికి దిగడం సిగ్గు చేటని వైఎస్సార్ సీపీ నేతలు మైసూరా రెడ్డి, పార్థసారధిలు విమర్శించారు. వారు సోమవారం మీడియాతోమాట్లాడుతూ.. ఈ అంశాన్ని రాష్ట్రాల మధ్య సమస్యగా అంటగట్టాలని టీడీపీ నేతలు చూస్తున్నారని విమర్శించారు. ఇది ఎంతమాత్రం రాష్ట్రాల మధ్య సమస్య కాదని.. వ్యక్తుల మధ్య సమస్య మాత్రమేనని స్పష్టం చేశారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు రకరకాల విన్యాసాలు చేస్తున్నారన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు నిర్దోషి అయితే విచారణ జరిపించుకుని నిరూపించుకోవాలన్నారు. ఓటుకు నోటు వ్యవహారం నిజంగా సిగ్గు చేటన్నారు. చంద్రబాబు వాయిస్ నిజం కాకపోతే సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. చంద్రబాబు వాయిస్ నిజం కాకపోతే సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. చంద్రబాబు రాజీనామాను కోరుతూ మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ధర్నా చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. -
' ఇదంతా ఓర్వలేకే.. బాధ్యులను వదిలిపెట్టం'
ప్రకాశం: నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు బహిర్గతం కావడంతో టీఆర్ఎస్ పార్టీ పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. టెలిగ్రాఫ్ చట్ట ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేయకూడదనే నిబంధన ఉన్నా.. టీఆర్ఎస్ నీచానికి పాల్పడుతుందని మంత్రి శిద్ధా రాఘవరావు విమర్శించారు. అసలు ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబు వాయిస్ కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ ఎదుగుతుంటే ఓర్వలేక ఇదంతా చేస్తున్నారన్నారన్నారు. దీన్ని బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని శిద్ధా రాఘవరావు హెచ్చరించారు. -
ప్రతివ్యూహంలో చంద్రబాబు
-
'నూటికి నూరుశాతం చంద్రబాబు గొంతే'
-
బీజేపీ పెద్దలు ఎందుకు నోరు మెదపడంలేదు
-
ప్రతివ్యూహంలో చంద్రబాబు
విజయవాడ: టీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో జరిపిన ఫోన్ సంభాషణల వ్యవహారం నుంచి బయటపడేందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతివ్యూహానికి సిద్ధమైన చంద్రబాబు.. మంత్రులంతా తమ తమ జిల్లాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగానే సోమవారం టీడీపీ నేతలతో అత్యవసర సమావేశమైయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే ధర్నాలు నిర్వహించాలని టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూత్రధారేనని తాజా ఆడియో టేపుల్లో బహిర్గతమైన సంగతి తెలిసిందే. స్టీఫెన్సన్కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో చంద్రబాబే ప్రధానపాత్ర పోషించినట్లు స్పష్టంగా తేలిపోయింది. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని బాబు స్వయంగా భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సంభాషణ రికార్డులు మీడియాకు విడుదల కావడంతో ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ క్యాడర్ లోతీవ్ర అలజడి రేపుతోంది. -
కస్టడీని పెంచమని పిటిషన్ వేయనున్న ఏసీబీ
-
టేపులవ్యవహారంపై సీఎం అత్యవసర బేటీ
-
రేవంత్ కస్టడీ పెంపుపై పిటిషన్ దాఖలు చేసే అవకాశం
హైదరాబాద్:నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్టైన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ కస్టడీని పెంచాలని కోరుతూ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతోంది. రేవంత్ రెడ్డి విచారణకు సహకరించని కారణంగా ఆయన కస్టడీ పెంపుపై ఏసీబీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే మరో రెండు రోజులు రేవంత్ కస్టడీపై కోర్టులో పిటిషన్ దాఖలకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఆయనతో పాటు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాల కస్టడీని పెంచాలని కోరే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసులో అరెస్టైన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని శనివారం ఏసీబీ అధికారులకు తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టనున్నారు. రేవంత్‌తో పాటు నిందితులు సెబాస్టియన్ హ్యారీ, రుద్ర ఉదయ్‌సింహను నాలుగు రోజుల ఏసీబీ కస్టడీకి అప్పగించారు. -
'అది నూటికి నూరుశాతం చంద్రబాబు గొంతే'
కడప: ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు వెంటనే తన ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేసి ఏసీబీ విచారణకు సిద్ధపడాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు అనేదానికన్నా అందులో చంద్రబాబు మాట్లాడిన మాటాలకు ప్రాధాన్యముందన్నారు. నూటికి నూరు శాతం ఆ ఫోన్ లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనన్నారు. ఒకవేళ కాకపోతే ఫోరెనిక్స్ ల్యాబ్ లో టెస్ట్ చేయించుకోవచ్చని రామచంద్రయ్య పేర్కొన్నారు. 'చంద్రబాబు మాట్లాడేతీరు, యాస, భాష నాకు పూర్తిగా తెలుసు. ఈ వాయిస్ నాది కాదంటూ ఇప్పుడు వివాదం చేస్తున్నారు. ల్యాబ్ కు పంపిస్తే నిజాలు బయటకు వస్తాయి. ముడుపులు వ్యవహారంలో చంద్రబాబు చేసింది పూర్తిగా వ్యక్తిగతం. కాని దీన్ని రాష్ట్రాల మధ్య యుద్ధంగా చూపిస్తున్నారు. ఇది అరాచకం. పరకాల ప్రభాకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీన్ని రాష్ట్రాల మధ్య యుద్ధంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా బాగున్నారు. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా కిరాతకం'అని సాక్షికి ఇచ్చిన ఇంటర్యూలో రామచంద్రయ్య పేర్కొన్నారు. -
'సీఎం పదవికి రాజీనామా చేయాలి'
ప్రకాశం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన చంద్రబాబు, నేరం ఒప్పుకోకుండా ఈ వ్యవహారాన్ని ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముడుపుల వ్యవహారంలో టీఆర్ఎస్, టీడీపీకి సంబంధించిందని ఆయన తెలిపారు. -
ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రేవంత్ రెడ్డి
హైదరాబాద్:: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్టైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. మూడోరోజు విచారణలో భాగంగా తొలుత రేవంత్ రెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు. రేవంత్ పాటు ఈ కేసులో అరెస్టైన సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరు ముగ్గురికి షుగర్ లెవిల్స్ సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. రెండోరోజు విచారణలో స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు సంగతి మాత్రం తనకు తెలియదని రేవంత్ బుకాయించారు. పైగా ఆ డబ్బుల బ్యాగ్ మోసిన ఉదయసింహను ఇరి కించేలా మాట్లాడారు. డబ్బుల బ్యాగు తెచ్చింది ఉదయసింహ అని, ఆయనకు ఆ డబ్బు ఎవరిచ్చారో తెలియదని చెప్పుకొచ్చారు. -
చంద్రబాబుపై చర్యకు సిద్దమవుతున్న టీ.సర్కార్
-
సీఎం కేసీఆర్ పై టీడీపీ నేతల ఫిర్యాదు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారును అస్థిర పరచడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగానే సోమవారం టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు , వర్ల రామయ్యలు గవర్నరు పేట, భవానీపురం పీఎస్ లలో కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో కలిసి కేసీఆర్ కుట్ర పన్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు ఏపీ సీఎం చేసిన కుట్ర తేటతెల్లమైన సంగతి తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబే అన్నది స్పష్టంగా తేలిపోయింది. ‘బాస్’ పంపితే వచ్చానన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాటల్లోని ‘బాస్’ చంద్రబాబే అని మీడియాకు అందిన ఆడియో రికార్డుల్లో స్పష్టంగా వెల్లడైంది. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని స్వయంగా భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంభాషణ రికార్డులు మీడియాకు విడుదల కావడంతో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అయితే దీనిపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఆ సంభాషణలు చంద్రబాబువి కావని ఇప్పటికే ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేయగా.. ఇది ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కేసీఆర్ పన్నిన కుట్ర మాత్రమేనని మరికొందరు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. -
ఉస్మానియాకు రేవంత్ రెడ్డి
-
ఉస్మానియాకు రేవంత్ రెడ్డి
హైదరాబాద్:నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు ముడుపులు ఇవ్వజూపుతూ అడ్డంగా దొరికిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మూడవ రోజు ఏసీబీ విచారణలో్ భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో అరెస్టైన సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు ఉస్మానియాకు తరలించారు. రేవంత్ రెడ్డి గొంతు నొప్పితో బాధపడుతున్నారని రేవంత్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కార్యాలయానికి రేవంత్ ను తరలించనున్నారు. -
'ఆ టేపులు చంద్రబాబువే అయితే రాజీనామా చేయాలి'
న్యూఢిల్లీ: కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర తేటతెల్లమైన నేపథ్యంలో ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో జరిపిన ఫోన్ సంభాషణలు చంద్రబాబు నాయుడువే అయితే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు సూత్రధారి అయితే మాత్రం వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని దిగ్విజయ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. If the audio tapes of Chandra Babu regarding cash for votes are genuine then he must resign. — digvijaya singh (@digvijaya_28) June 8, 2015 -
సిట్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మూడవ రోజు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం ఏసీబీ అధికారులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి మూడవ రోజు విచారణలో భాగంగా ఆయన్ను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. రేవంత్ రెండోరోజు విచారణలో స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు సంగతి మాత్రం తనకు తెలియదని ఆయన బుకాయించారు. పైగా ఆ డబ్బుల బ్యాగ్ మోసిన ఉదయసింహను ఇరి కించేలా మాట్లాడారు. డబ్బుల బ్యాగు తెచ్చింది ఉదయసింహ అని, ఆయనకు ఆ డబ్బు ఎవరిచ్చారో తెలియదని చెప్పుకొచ్చారు. 'మేం ఎమ్మెల్సీని గెలవాలె. మా ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎట్ల తనవైపు తిప్పుకున్నడో అట్లనే మేం కూడా టీఆర్ఎస్ అసంతృప్తి ఎమ్మెల్యేల మీద కన్నేసినం. తెలుగుదేశానికి ఓటేస్తె భవిష్యత్ బాగుంటదని చెప్పినం. స్టీఫెన్సన్ మాకు టచ్‌లోకి వస్తెనే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడిన..’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారుల విచారణలో చెప్పారు. -
ఆ డబ్బెక్కడిదో.. నాకేమీ తెలియదు!
-
ఆడియో టేపులతో అడ్డంగా దొరికిన బాబు
-
చంద్రబాబును అరెస్టు చేయాలి: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెట్టి, అరెస్టు చేయాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రత్యక్షంగా మాట్లాడిన ఆడియోటేపులు బహిర్గతమైన అంశాన్ని ఏసీబీ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నీతిసూత్రాలు, నైతిక విలువలంటూ మాట్లాడే చంద్రబాబు నిజస్వరూపం ఏమిటో ఈ టేపుల ద్వారా వెల్లడైందని విమర్శించారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారో తేల్చడానికి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని పొంగులేటి మండిపడ్డారు. -
మా సీఎం ఫోన్ ట్యాప్ చేశారా?
⇒ ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ ⇒ సాక్ష్యాధారాలన్నీ కోర్టుకు సమర్పించినప్పుడు ఈ ఆడియో రికార్డింగ్ ఎక్కడిది? ⇒ మమ్మల్ని అభాసుపాలు చేయడానికి, మా స్థ్యైరాన్ని దెబ్బతీయడానికి తెచ్చారా? ⇒ డీజీపీ, ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు సమాలోచనలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ రికార్డులు వెలుగు చూసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఏపీ పోలీసు ఉన్నతాధికారులు, న్యాయవాదులు, పార్టీ సీనియర్ నేతలతో ఆదివారం తన నివాసంలో అర్ధరాత్రి వరకు సమాలోచనలు జరిపారు. అనంతరం ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు బయటకు పొక్కిన ఆడియోలోని సంభాషణలోనిది ఏపీ సీఎం గొంతు కాదని చెప్పారు. అది ఏపీ ముఖ్యమంత్రి సంభాషణ కాదన్నారు. ఈ కేసులో సేకరించిన సాక్ష్యాధారాలన్నీ కోర్టుకు సమర్పించినప్పుడు ఈ ఆడియో రికార్డింగ్ ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. సాక్ష్యాధారాల్లో సేకరించింది కాదా? మా ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేశారా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం ఫోన్ టాప్ చేశామని చెబుతారా? అసలు ఈ టేపులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. మీకున్న టెక్నాలజీతో గుదిగుచ్చి అభాసుపాలు చేయడానికి, అవమానించడానికి మా మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడానికి తెచ్చారా? చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఏసీబీ డీజీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇది ఫోన్‌ట్యాపింగ్ కాకుండా.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ తన ఫోన్లో ఆడియో రికార్డ్ చేసిందని అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా.. అలాంటివేమైనా ఉంటే కోర్టు సమక్షంలో ఉండాలి కదా అని పరకాల బదులిచ్చారు. దర్యాప్తు చేస్తున్నవారు ఆడియో, వీడియో టేపులు, ఇతర సాక్ష్యాధారాలు ఏమున్నా కోర్టు ముందుంచాలని, అలాకాకుంటే వీళ్లు రుజువులను తారుమారు చేస్తున్నట్టేనని చెప్పారు. ‘‘కోర్టులో ఉండాల్సినవి బయటకు వచ్చాయంటే మీరు కావాలని గుదిగుచ్చి అభాసుపాలు చేయడానికి చేస్తున్నట్టే. ఈ ఉదంతంపై ఊరుకునే ప్రసక్తే లేదు. అంతుచూస్తాం’’ అని ఆయన హెచ్చరించారు. ‘ఇదంతా తెలంగాణ సీఎం చేసిన పనికాదా? నాకు సంబంధం లేదని ఆయన్ను చెప్పమనండి? ఈ ఆడియో టేపులకు సోర్స్ ఏంటో చెప్పమనండి’ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా పోరాటం చేస్తామన్నారు. ఏపీ సీఎం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఉమ్మడి రాజధానిలో ఉమ్మడి గవర్నర్ భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంటుందని, అయితే గవర్నర్ పాత్రేమిటో ఆలోచించుకోవాలని పరకాల అన్నారు. ఉమ్మడి రాజధానిలో ఏపీ సీఎం పట్ల మీరు వ్యవహరించే తీరు ఇదేనా? అని అన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో వారిని శిక్షించేవరకు, జైలుకు పంపించేవరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. మీరు సంబరాలు చేసుకుని రే పటిరోజున తాము ‘మహాసంకల్పం’ నిర్వహించుకునే దశలో ఇంతటి నీచమైన, క్షుద్రమైన, దారుణమైన పనికి ఒడిగడతారా? అని మండిపడ్డారు. దీనికి మూల్యం చెల్లించకతప్పదన్నారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ చివరివరకూ తీసుకెళ్తామని చెప్పారు. ఉలిక్కిపడిన బాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల లంచం ఎరవేసి రూ.50 లక్షలు ముట్టజెప్పిన సందర్భంగా అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి కేసులో చంద్రబాబు ప్రమేయమున్నట్టు ఆడియో టేపులద్వారా వెల్లడికావడం తెలుగుదేశం నేతలను కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వ్యవహారంలో నేరుగా చంద్రబాబు ప్రమేయమున్నట్టు ఆడియో టేపులు టీవీల్లో ప్రసారం కావడం చూసి చంద్రబాబుతోపాటు మంత్రులు, సీనియర్ నేతలు ఉలిక్కిపడ్డారు. స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ బయటకు పొక్కిన నేపథ్యంలో చంద్రబాబు ఆగమేఘాలపై ఏపీ పోలీసు ఉన్నతాధికారులు, పలువురు న్యాయవాదులను పిలిపించుకుని తన నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకు అధికారులు, పలువురు మంత్రులతో ఆయన సుదీర్ఘ మంతనాల్లో మునిగిపోయారు. తక్షణం ఎలా స్పందించాలన్న విషయంపై తర్జనభర్జన పడ్డారు. డీజీపీ రాముడుతోపాటు ఇంటెలిజెన్స్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశానంతరం ఆయన న్యాయవాదులు, పార్టీ సీనియర్లతో విడిగా సమాలోచనలు జరిపారు. నామినేటెడ్ ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణకు సంబంధించి ఆడియో రికార్డులు ఎలా బయటపడ్డాయి? ఎవరిచ్చారు? తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? ఈ మొత్తం వ్యవహారంపై ఎలా స్పందించాలి? వంటి అంశాలపై చంద్రబాబు లోతుగా చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సుదీర్ఘ మంతనాల అనంతరం పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. అయితే, పరకాల ప్రభాకర్ వివరణపై పెదవి విరిచిన పలువురు తమకు సూటిగా సమాధానం చెప్పాలంటూ పలు ప్రశ్నలు సందించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ? ► టేపుల్లో ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరం కాదంటారు... ఆ వెంటనే వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన చంద్రబాబు మాటలే అతికించారంటారు. ఇందులో ఏది నిజం? ► ఆ టేపుల్లో ఉన్నది తన స్వరం కాకపోతే చంద్రబాబు స్వయంగా ఎందుకు ఖండించలేదు? ► రేవంత్‌రెడ్డి వ్యవహారం బయటపడినప్పటినుంచీ చంద్రబాబు ఆ అంశంపై నోరెందుకు విప్పలేదు? ► రేవంత్ ఎపిసోడ్‌తో మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఇప్పటివరకూ టీడీపీకి ఎందుకు లేకపోయింది? ► యావత్ తెలుగుజాతి టీడీపీని ముద్దాయిగా చూస్తున్నా నిజమేంటో చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ► రేవంత్‌రెడ్డిపై కుట్రచేశారని బుకాయిస్తారే తప్ప... రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇచ్చింది వాస్తవంకాదా? ‘బాస్’ చెప్తేనే వచ్చానని చెప్పలేదా? ► ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోతే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై కుట్ర జరిగిందంటారేం. ఏపీ సీఎంకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏం అవసరం? ► మీ పార్టీ, మీ అధినేత తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చాలని చూస్తారేం? -
ఆ డబ్బెక్కడిదో.. నాకేమీ తెలియదు!
ఏసీబీ అధికారుల ప్రశ్నలకు రేవంత్ అడ్డగోలు సమాధానాలు పూసగుచ్చినట్లు వివరాలు వెల్లడించిన సెబాస్టియన్, ఉదయ సింహ సాక్షి, హైదరాబాద్: ‘మేం ఎమ్మెల్సీని గెలవాలె. మా ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎట్ల తనవైపు తిప్పుకున్నడో అట్లనే మేం కూడా టీఆర్ఎస్ అసంతృప్తి ఎమ్మెల్యేల మీద కన్నేసినం. తెలుగుదేశానికి ఓటేస్తె భవిష్యత్ బాగుంటదని చెప్పినం. స్టీఫెన్సన్ మాకు టచ్‌లోకి వస్తెనే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడిన..’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారుల విచారణలో చెప్పారు. కానీ స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు సంగతి మాత్రం తనకు తెలియదని బుకాయించారు. పైగా ఆ డబ్బుల బ్యాగ్ మోసిన ఉదయసింహను ఇరి కించేలా మాట్లాడారు. డబ్బుల బ్యాగు తెచ్చింది ఉదయసింహ అని, ఆయనకు ఆ డబ్బు ఎవరిచ్చారో తెలియదని చెప్పుకొచ్చారు. ఆదివారం కేసు పరిశోధనాధికారి అశోక్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు నిందితులను విడివిడిగా ప్రత్యేక గదుల్లో నిందితుల తరఫు న్యాయవాదుల సమక్షంలో విచారించారు. రేవంత్‌తో పాటు పట్టుబడిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చి పంపించారనే దానిపై గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అధికారులు తరచూ మారుతూ.. ‘ఆయన అలా చెప్పారు. నువ్వి లా చెబుతున్నావేంటి?’ అంటూ వారి నుంచి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. జానారెడ్డి మీకెందుకు సాయం చేశారు?: కాంగ్రెస్ నేత జానారెడ్డితో సన్నిహిత సంబంధాల గురించి అధికారులు రేవంత్‌ను ప్రశ్నించారు. జానారెడ్డి రాజకీయంగా తెలుసని రేవంత్ చెప్పగా.. ‘మరి 2009 ఎన్నికల్లో జానారెడ్డి మీకు ఆర్థికంగా ఎందుకు సాయపడ్డార’ని ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. 2009 ఎన్నికల గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారని రేవంత్ ఎదురు ప్రశ్నించారని, దాంతో ‘అది నిజమా కాదా?’ అని అధికారులు నిలదీయగా రేవంత్ అడ్డంగా తలూపారని తెలుస్తోంది. రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి రేవంత్ సాగించిన భూ దందాలు, ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ హోం మంత్రుల కుమారులు సాగించిన సెటిల్మెంట్ల విషయాన్ని ప్రశ్నించి నట్లు తెలిసింది. పలు కీలక వివరాలు వెల్లడి.. రెండో రోజు ఏసీబీ విచారణలో రేవంత్ సరైన సమాధానాలు చెప్పకుండా సతాయించగా.. మిగతా నిందితులు టీడీపీ క్రిస్టియన్ విభాగంలో ముఖ్యనేతగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ మాత్రం డబ్బు విషయాన్ని పూసగుచ్చినట్లుగా వివరించినట్లు సమాచారం. రేవంత్‌తో తనకున్న పరిచయం, మత్తయ్య ద్వారా స్టీఫెన్సన్ను కలిసి డీల్ మాట్లాడిన విషయాలను సెబాస్టియిన్ ఏసీబీ అధికారులకు వివరించినట్లు తెలిసింది. తానో చిన్న నాయకుడినని, తనకు అండగా ఉంటానని రేవంత్‌రెడ్డి చెప్పాకే స్టీఫెన్‌సన్‌తో సంప్రదింపులు జరిపానని చెప్పినట్లు సమాచారం. అలాగే స్టీఫెన్సన్ వద్దకు డబ్బుల బ్యాగు తెచ్చిన ఉదయసింహ కూడా తనకు డబ్బు ఎవరి ద్వారా వచ్చిందో అధికారులకు వివరించినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి చెప్పిన ప్రకారమే తాను నడి చానని, తనకు రూ.50 లక్షలు సొంతంగా సంపాదించే శక్తి లేదని కూడా ఒప్పుకొన్నట్లు సమాచారం. అయితే వీరిద్దరు చెప్పిన మాటల ప్రకారం రేవంత్‌ను అధికారులు ప్రశ్నించగా.. తనకేమీ తెలియదనే బుకాయించినట్లు తెలిసింది. బాస్ చంద్రబాబు డబ్బులు పంపించారా? అని అధికారులు అడగగా.. డబ్బు గురించే తనకు తెలియదన్నప్పుడు బాబు గురించి ఎందుకడుగుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తంగా రెండో రోజు విచారణ అనంతరం ఏసీబీ అధికారులకు కేసు విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లు తెలిసింది. దానికి అనుగుణంగా చంద్రబాబుకు నోటీసులు పంపించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సౌకర్యాలు కల్పించడం లేదు ఏసీబీ అధికారులపై రేవంత్‌రెడ్డి న్యాయవాదుల ఆరోపణ రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు దర్యాప్తు అనంతరం సిట్ కార్యాలయానికి తరలిస్తున్నారని, అక్కడ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది సుధీర్‌కుమార్ ఆరోపించారు. రేవంత్ ఆరోగ్యం దెబ్బతిన్నదని, గొంతు నొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారని.. కలుషితమైన నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వచ్చిందని, జ్వరం కూడా ఉందని పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరీ రిమాండ్ ఖైదీకి ఇచ్చే కనీస సౌకర్యాలు కల్పించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. సిట్‌లో కాకుండా సౌకర్యాలున్న కార్యాలయంలో నిందితులను ఉంచాలని ఏసీబీని కోరినట్లు చెప్పారు. ఇక ఇతర నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహల తరపు న్యాయవాదులు రవికుమార్, రాకేష్‌సింగ్ సైతం ఇవే ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా ఉదయం సిట్ కార్యాలయం నుంచి ఏసీబీ హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకొచ్చేటప్పుడు రేవంత్‌రెడ్డి మీడియాను చూస్తూ.. ‘ఈ కొడుకులు కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు..’ అని అరవడం గమనార్హం. రేవంత్ అనుమానాస్పద సంచారంపై ఆరా ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి అనుమానాస్పద సంచారంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏసీబీకి దొరికిపోవడానికి ముందు వారం రోజుల్లో మూడు సార్లు గన్‌మన్ లేకుండా రేవంత్‌రెడ్డి బయటకు వెళ్లారు. ఆయన ఎక్కడికెళ్లారు, గన్మెన్లను ఎందుకు వద్దని వారించారు, ఎంతసేపు వెళ్లారు, ఆ సమయంలో గన్‌మెన్ ఎక్కడున్నారు.. తదితర వివరాలకు సంబంధించి గన్మెన్ల వాంగ్మూలాలను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీంతోపాటు రేవంత్‌రెడ్డి అరెస్టుకు ముందు వారం రోజులకు సంబంధించిన కాల్ డేటాను ఏసీబీ విశ్లేషించింది. ఈ ఫోన్ సంభాషణలో దాదాపు 70 సార్లు చంద్రబాబు ప్రస్తావన ఉన్నట్లుగా తేలినట్లు సమాచారం. ఇక రేవంత్‌తోపాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహ ఫోన్లకు వచ్చిన కాల్స్‌పైనా అధికారులు ఆరా తీశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న దాదాపు 20 మంది కాల్‌డేటాను ఏసీబీ సేకరించింది. -
సూత్రధారి బాసే!
⇒ అడ్డంగా దొరికిన చంద్రబాబు ⇒ స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆడియో టేపు బట్టబయలు ⇒ ఎమ్మెల్యేల బేరసారాల సూత్రధారి ఏపీ ముఖ్యమంత్రే ⇒ రేవంత్‌రెడ్డి చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడతామని స్పష్టమైన హామీ ⇒ కంగారు పడాల్సిందేమీ లేదని భరోసా ఇచ్చిన ఏపీ సీఎం ⇒ ఏ క్షణంలోనైనా చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ⇒ ఈ విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసిన సీఎం కేసీఆర్ ⇒ చంద్రబాబు పాత్రకు సంబంధించి ఏసీబీ వద్ద మరిన్ని ఆధారాలు ⇒ టీడీపీ అధినేత అరెస్టుకు అవకాశం ఉందంటున్న ఉన్నతాధికారవర్గాలు సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ నీతి నిజాయితీ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిజ స్వరూపం బట్టబయలైంది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు ఏపీ సీఎం చేసిన కుట్ర తేటతెల్లమైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబే అన్నది స్పష్టంగా తేలిపోయింది. ‘బాస్’ పంపితే వచ్చానన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాటల్లోని ‘బాస్’ చంద్రబాబే అని మీడియాకు అందిన ఆడియో రికార్డుల్లో స్పష్టంగా వెల్లడైంది. స్టీఫెన్‌సన్‌తో ఆ ‘బాస్’ చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని స్వయంగా భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సంభాషణ రికార్డులు మీడియాకు విడుదల అయ్యాయి. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి సరిపోయే బలం తెలంగాణ టీడీపీకి లేకపోయినా చంద్రబాబు పార్టీ తరఫున అభ్యర్థిని బరి లోకి దింపారు. ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అన్ని అడ్డదారులు తొక్కారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. నిధుల సేకరణకు పారిశ్రామికవేత్తలను ఉపయోగించుకున్నారు. ఎమ్మెల్యేలతో బేరసారాలు చేసే బాధ్యతను తెలంగాణ టీడీపీ నేతలకు అప్పగిం చారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు అంటే మే 31న (ఆదివారం) సాయంత్రం నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలులంచం ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లేకపోతే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి కచ్చితంగా 20 ఓట్లు వచ్చి ఉండేవి. హైదరాబాద్‌లో రేవంత్ పట్టుబడటంతోనే ఇతర ఎమ్మెల్యేలకు అడ్వాన్స్ రూపంలో ఇచ్చేందుకు తీసుకెళుతున్న డబ్బు మూటలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి. అప్పటికే అడ్వాన్స్ తీసుకున్న ఎమ్మెల్యేలు వాటిని తిప్పిపంపారు. ఇలా ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన రికార్డులే కాకుండా ఇతరత్రా ఆధారాలను కూడా ఏసీబీ ఇప్పటికే సేకరించింది. ఏక్షణంలోనైనా ఆయనకు నోటీసులు ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సూత్రధారి అయిన చంద్రబాబును ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు ఏ క్షణంలోనైనా ఆయనకు నోటీసులు జారీచేసే అవకాశముంది. చంద్రబాబును విచారించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను ఏసీబీ ఇప్పటికే సేకరించి పెట్టుకుంది. రేవంత్ ఇవ్వజూపిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలు కూడా ఏసీబీ దగ్గర ఉన్నాయి. మంగళవారం (9వ తేదీన) విచారణకు హాజరు కావాల్సిందిగా చంద్రబాబుకు నోటీసులు జారీచేసే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎమ్మెల్యేల కొనుగోలుకు పార్టీ నేతలను ప్రోత్సహించిన ఘటనలు దేశంలో ఇప్పటిదాకా లేవు. ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు చంద్రబాబు సాగించిన అక్రమాల పర్వంలో మరిన్ని ఆధారాలు కూడా త్వరలో బయటపడతాయని... ఈ బేరసారాల్లో ప్రధాన పాత్ర వహించిన టీడీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలంగాణ టీడీపీ కీలక నేత ఒకరిని కూడా విచారించే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు చెప్పాయి. చంద్రబాబుకు నోటీసు ఇవ్వడంతో పాటు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌కు వివరించిన కేసీఆర్.. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు బేరసారాల నేపథ్యంలో ఆయనపై చర్య తీసుకునే విషయాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. బాబును విచారించేందుకు ఏ క్షణంలోనైనా నోటీసు జారీ చేస్తారని తెలియజేశారు. ఆదివారం రాత్రి రాష్ట్ర అవతరణ ముగింపు ఉత్సవాల్లో గవర్నర్‌తో వేదిక పంచుకున్న కేసీఆర్.. ఉత్సవాలు ముగిసిన వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. రూ.5 కోట్లు ఇస్తామన్న రేవంత్.. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ కావడానికి ముందు స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టారు. రూ.2 కోట్ల వరకు ఇచ్చేందుకు తనకు అనుమతి ఉందని, రూ.5 కోట్లు కాబట్టి ‘బాస్’తో మాట్లాడిస్తానని చెప్పారు. ఈ వ్యవహారాన్ని టీఆర్ఎస్ గుర్తించి ఇబ్బంది పెడితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. రేవంత్ ఇచ్చిన ఈ హామీలన్నింటికీ తాను కట్టుబడి ఉన్నట్లు స్టీఫెన్సన్కు చంద్రబాబు స్వయంగా భరోసా ఇచ్చారు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణ చంద్రబాబు అనుచరుడు: హలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టు యూ.. బి ఆన్ ద లైన్ (హలో బ్రదర్. బాబు గారు మీతో మాట్లాడతారు. లైన్లో ఉండండి) స్టీఫెన్సన్: యా.. చంద్రబాబు: హలో.. స్టీఫెన్సన్: సార్... గుడ్ ఈవెనింగ్ సార్.. చంద్రబాబు: గుడ్ ఈవెనింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ (మీరు ఎలా ఉన్నారు..?) స్టీఫెన్సన్: ఫైన్.. థాంక్యూ సర్ చంద్రబాబు: మన వాళ్లు బ్రీఫ్డ్ మి.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్ (మనవాళ్లు నాకు అంతా వివరిం చారు. మీకు అండగా నేనున్నాను. కంగారు పడాల్సిందేమీ లేదు) స్టీఫెన్సన్: యస్ సార్.. రైట్ సార్ (మంచిది సర్) చంద్రబాబు: ఫర్ ఎవ్రీ థింగ్ అయామ్ విత్ యూ.. వాట్ ఆల్ దే స్పోక్... విల్ ఆనర్ (దేనికైనా మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం) స్టీఫెన్సన్: యస్ సార్.. రైట్ సార్ చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్ డిసైడ్.. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. ఎలాంటి సమస్యా లేదు) స్టీఫెన్సన్: ఓకే సార్.. (మంచిది సార్) చంద్రబాబు: దటీజ్ అవర్ కమిట్మెంట్.. వియ్ విల్ వర్క్ టుగెదర్ (అది మా హామీ.. మనం కలసి పనిచేద్దాం) స్టీఫెన్సన్: రైట్.. థాంక్యూ సార్.. చంద్రబాబు: థాంక్యూ -
చంద్రబాబు ఆడియో టేపులు బహిర్గతం
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో టేపులు తాజాగా బహిర్గతం అయ్యాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన దాన్ని తాను తప్పకుండా నెరవేరుస్తానని స్టీఫెన్సన్ కు చంద్రబాబు ఇచ్చిన హామీలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు చంద్రబాబుకు ఏ క్షణంలోనూనా నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది. స్టీఫెన్సన్ తో చంద్రబాబు సంభాషణ ఈ విధంగా సాగింది.. చంద్రబాబు తరపు మనిషి:హలో బ్రదర్.. బాబుగారు మీతో మాట్లాడతారు.. లైన్ లో ఉండండి ఎమ్మెల్యే స్టీఫెన్సన్: సార్.. గుడ్ ఈవెనింగ్ సార్ చంద్రబాబు:గుడ్ ఈవెనింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ స్టీఫెన్సన్: ఫైన్.. థాంక్యూ సర్ చంద్రబాబు:మనవాళ్లు నాకంతా వివరించారు.. మీకు అండగా నేనుంటా.. కంగారు పడాల్సిందేమీ లేదు స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్ చంద్రబాబు:అన్నింటికీ మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్ చంద్రబాబు:మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి.. ఎలాంటి సమస్య లేదు స్టీఫెన్సన్:ఒకే సార్ చంద్రబాబు:అది మా హామీ.. మనం కలిసి పనిచేద్దాం స్టీఫెన్సన్:రైట్.. థాంక్యూ సార్.. చంద్రబాబు:థాంక్యూ స్టీఫెన్సన్ తో రేవంత్ మాట్లాడిన సంభాషణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: