
'ఆ టేపులు చంద్రబాబువే అయితే రాజీనామా చేయాలి'
న్యూఢిల్లీ: కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర తేటతెల్లమైన నేపథ్యంలో ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో జరిపిన ఫోన్ సంభాషణలు చంద్రబాబు నాయుడువే అయితే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు సూత్రధారి అయితే మాత్రం వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని దిగ్విజయ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
If the audio tapes of Chandra Babu regarding cash for votes are genuine then he must resign.
— digvijaya singh (@digvijaya_28) June 8, 2015