
ఉస్మానియాకు రేవంత్ రెడ్డి
హైదరాబాద్:నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు ముడుపులు ఇవ్వజూపుతూ అడ్డంగా దొరికిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మూడవ రోజు ఏసీబీ విచారణలో్ భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో అరెస్టైన సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు ఉస్మానియాకు తరలించారు.
రేవంత్ రెడ్డి గొంతు నొప్పితో బాధపడుతున్నారని రేవంత్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కార్యాలయానికి రేవంత్ ను తరలించనున్నారు.