నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మూడవ రోజు ఏసీబీ అధికారులు విచారించనున్నారు.
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మూడవ రోజు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం ఏసీబీ అధికారులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి మూడవ రోజు విచారణలో భాగంగా ఆయన్ను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు.
రేవంత్ రెండోరోజు విచారణలో స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన డబ్బు సంగతి మాత్రం తనకు తెలియదని ఆయన బుకాయించారు. పైగా ఆ డబ్బుల బ్యాగ్ మోసిన ఉదయసింహను ఇరి కించేలా మాట్లాడారు. డబ్బుల బ్యాగు తెచ్చింది ఉదయసింహ అని, ఆయనకు ఆ డబ్బు ఎవరిచ్చారో తెలియదని చెప్పుకొచ్చారు.
'మేం ఎమ్మెల్సీని గెలవాలె. మా ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎట్ల తనవైపు తిప్పుకున్నడో అట్లనే మేం కూడా టీఆర్‌ఎస్ అసంతృప్తి ఎమ్మెల్యేల మీద కన్నేసినం. తెలుగుదేశానికి ఓటేస్తె భవిష్యత్ బాగుంటదని చెప్పినం. స్టీఫెన్‌సన్ మాకు టచ్‌లోకి వస్తెనే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడిన..’ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారుల విచారణలో చెప్పారు.