
ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రేవంత్ రెడ్డి
హైదరాబాద్:: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్టైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. మూడోరోజు విచారణలో భాగంగా తొలుత రేవంత్ రెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు. రేవంత్ పాటు ఈ కేసులో అరెస్టైన సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలకు ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరు ముగ్గురికి షుగర్ లెవిల్స్ సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
రెండోరోజు విచారణలో స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన డబ్బు సంగతి మాత్రం తనకు తెలియదని రేవంత్ బుకాయించారు. పైగా ఆ డబ్బుల బ్యాగ్ మోసిన ఉదయసింహను ఇరి కించేలా మాట్లాడారు. డబ్బుల బ్యాగు తెచ్చింది ఉదయసింహ అని, ఆయనకు ఆ డబ్బు ఎవరిచ్చారో తెలియదని చెప్పుకొచ్చారు.