విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకోసం ఎమ్మెల్యేతో ఫోన్‌లో బేరసారాలు సాగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని తక్షణమే అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ డిమాండ్ చేశారు. అవినీతికి కేరాఫ్‌గా మారిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై చంద్రబాబు మౌనంగా ఉంటూ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడించటం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.
బాబు హుందాగా తనపై విచారణకు డిమాండ్ చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ మాట్లాడుతూ.. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబును తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు పాలించే అర్హత లేదు: జలీల్‌ఖాన్
Published Mon, Jun 8 2015 8:55 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement
Advertisement