
'చంద్రబాబు ఫోన్ సంభాషణలు మా దగ్గరున్నాయి'
వరంగల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే క్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఫోన్ సంభాషణలు తమ దగ్గర ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని నాయిని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బేరమాడారని ఆయన అన్నారు.
అందుకు సంబంధించిన ఆధారాలు (ఫోన్ సంభాషణలు) కూడా తమ దగ్గర ఉన్నాయని నాయిని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు తారుమారు కానున్నాయని ఆయన అన్నారు. త్వరలోనే ఆధారాలన్నీ బయట పెడుతామని నాయిని నరసింహారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.