
'చినబాబు, పెదబాబు.. ఎవరున్నా అంతే'
'ఓటుకు నోటు' వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాత్ర విషయంలో తాము చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు గానీ, చినబాబు, పెదబాబు గానీ ఎవరున్నా కూడా విచారణలో అన్నీ తేలుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఇక తాము ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదని నాయిని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మభూమి సభలలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం తనను బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించిన విషయం తెలిసిందే.