
పరకాల ప్రభాకర్
హైదరాబాద్: పింఛన్ విషయంలో కమిటీని ఏర్పాటు చేయడం వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశంలేదని ఏపి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. అర్హులను పింఛన్ జాబితా నుంచి తొలగించం, వారు భయపడవలసిన అవసరం లేదన్నారు. కొత్తగా ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకున్నా పింఛన్ ఇస్తారని చెప్పారు.
పింఛన్ మంజూరులో చాలా అక్రమాలు జరిగే అవకాశం ఉందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక స్పష్టం చేసినట్లు చెప్పారు. అందుకే అనర్హులను తొలగిస్తామని పరకాల చెప్పారు.
**