హైదరాబాద్: ఫించన్లకు అర్హులైన వారిని జాబితా నుంచి తొలగించలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. అర్హులైన వారు కొత్తగా దరఖాస్తు చేసుకున్నా పింఛన్లు ఇస్తామని శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాటైన కమిటీ ఏర్పాటులో ఎలాంటి రాజకీయ దురద్దేశం లేదని ఆయన తెలిపారు. పింఛన్ల మంజూరులో చాలా అక్రమాలు ఉంటాయని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని తెలిపారు. అందుకే అనర్హులను తొలగించేందుకు కసరత్తులు ఆరంభిచినట్లు పరకాల తెలిపారు.