
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న తొమ్మిదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రిటైర్ కానున్నారు. అదే స్థాయిలో పెన్షన్ల వ్యయం కూడా భారీగా పెరగనుంది. వచ్చే తొమ్మిదేళ్లలో 1,33,417 మంది ఉద్యోగులు రిటైర్ కానుండగా పెన్షన్ల రూపంలో ప్రభుత్వం మొత్తం రూ.2,80,141.94 కోట్లు చెల్లించనుంది. రాష్ట్ర ద్రవ్య విధాన పత్రంలో ఆర్థిక శాఖ ఈ వివరాలను పొందుపరిచింది.
వచ్చే ఏడాది 13,643 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం పెన్షన్ల వ్యయం రూ.20 వేల కోట్లు ఉండగా వచ్చే ఏడాది రూ.25,520.04 కోట్లకు పెరగనుంది. 2024 నుంచి 2032 వరకు ఏటా 13 వేల నుంచి 16 వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతారని ద్రవ్య విధాన పత్రం వెల్లడించింది. దీంతో 2032 నాటికి పెన్షన్ల వ్యయం రూ.41,803.40 కోట్లకు పెరుగుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment