'ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి'
హైదరాబాద్: హుదూద్ తుపాన్ నేపథ్యంలో ఇప్పటివరకు లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తుపాను తీరాన్ని దాటే సమయంలో ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు. తుపాన్ తీరం దాటిన ఆరుగంటల తర్వాత ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు.
ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని....ప్రభుత్వం సూచించిన తర్వాతే తమతమ నివాసాల నుంచి బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుపాన్ సహాయక చర్యల్లో త్రివిద దళాలకు చెందిన బలగాలు పాల్గొంటున్నాయని అన్నారు. తుపాన్ తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు రేడియో, మొబైల్ ద్వారా సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో హుదూద్ తీరం దాటుతుందన్ని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు.