'తెలంగాణ సర్కారుకు చట్టాలంటే గౌరవం లేదు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి చట్టాలంటే గౌరవం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్ విమర్శించారు. ప్రతి అంశంలోనూ తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
కార్మిక శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, న్యాయంగా మా రాష్ట్రానికి రావాల్సిన వాటానే దక్కించుకున్నామని ఆయన తెలిపారు.
మురళిసాగర్ అనే అధికారిపై దౌర్జన్యానికి దిగారని, ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టారని పరకాల మీడియాకు వెల్లడించారు. ప్రతి రూపాయి లెక్కను మేం తెలుస్తాం. మాకు రావాల్సిన హక్కులను సాధించుకుంటాం అని పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు.