Director Shankar Son-in-Law Rohit Damodaran Booked Under POCSO Act - Sakshi
Sakshi News home page

Director Shankar: డైరెక్టర్‌ శంకర్‌ అల్లుడుపై లైంగిక వేధింపుల కేసు!

Published Thu, Oct 21 2021 12:41 PM | Last Updated on Thu, Oct 21 2021 1:43 PM

Director Shankar Son In Law Rohit Damodaran Booked In Molestation Case - Sakshi

ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ అల్లుడు, క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు తెలుస్తోంది. రోహిత్‌తో పాటు మరో అయిదుగురిని పుదుచ్చెరి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. 16 ఏళ్ల మైనర్‌ బాలికను లైంగిక వేధించారనే ఆరోపణలతో రోహిత్‌, మిగలిన అయిదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్‌, అతడి తండ్రి దామోదరన్‌, కోచ్‌ థమరాయ్‌ కన్నన్‌తో పాటు మరో ఇద్దరిపై పుదుచ్చెరిలోని మెట్టుపాళ‌య‌మ్ పోలీస్ స్టేష‌న్‌లో కుటుంబ సభ్యులతో కలిసి బాధిత బాలిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన తనని లైంగికంగా వేధించార‌ని సదరు బాధిత బాలిక ఫిర్యాదులో పేర్కొంది.

చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత

దీంతో రోహిత్‌తో పాటు అతడి తండ్రి, కోచ్‌ మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని తనని బెదిరించిట్లు చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీకి ఇచ్చిన మ‌రో ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. అ‍యితే వారిని అరెస్టు చేశారా? లేదా?, ఇంకా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది జూన్‌లో డైరెక్టర్‌ శంకర్‌ పెద్ద కూతురు ఐశ్వర్యతో రోహిత్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 

చదవండి: ఘనంగా శంకర్‌ కూతురి వివాహం, హాజరైన సీఎం

చదవండి: నాగబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement