![Bill Gates son in law Nayel Nassar to compete in Paris Olympics 2024](/styles/webp/s3/article_images/2024/07/27/billgates.jpg.webp?itok=krvKALcU)
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒలింపిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విశ్వ క్రీడా పోటీలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ పోటీలపై అందరికన్నా ఉత్సాహంగా ఉంది మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ కుటుంబం. కారణం ఆయన అల్లుడు ఈ పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడుతుండటం.
బిల్ గేట్స్ అల్లుడు, నాయెల్ నాసర్ ఈజిప్ట్ దేశం తరఫున ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పోటీ పడుతున్నారు. నాసర్ ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్. మెలిందా, బిల్ గేట్స్‌ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. ఒలింపిక్స్ పాల్గొంటున్న తన అల్లుడిని ఉత్సాహపరుస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో మెలిందా ఫ్రెంచ్ గేట్స్ మద్దతు తెలియజేశారు.
![](/sites/default/files/inline-images/billgates--.jpg)
నాసర్ ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్. అంతర్జాతీయ పోటీలలో ఈజిప్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒలింపిక్ అథ్లెట్. ఈజిప్షియన్ తల్లిదండ్రులకు చికాగోలో జన్మించారు. కువైట్‌లో పెరిగారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. ఐదు సంవత్సరాల వయస్సు నుంచే గుర్రపు స్వారీ పట్ల మక్కువ పెంచుకున్న నాసర్ అనేక ప్రపంచ ఈవెంట్లలో పాల్గొన్నారు. బిల్, మెలిందా గేట్స్‌ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్‌ను 2021లో వివాహం చేసుకున్నారు. వీరికో పాపాయి కూడా పుట్టింది.
Comments
Please login to add a commentAdd a comment