తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. మామ, అల్లుళ్ల జంట అసెంబ్లీలోకి త్వరలో అడుగిడనుంది. ఆ మామ, అల్లుళ్లు ఎవరో కాదు సాక్షాత్తూ సీఎం పినరయి విజయన్, ఆయన అల్లుడు పి.ఎ.మొహమ్మద్ రియాస్..!. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్(77) కన్నూర్ జిల్లా ధర్మదామ్ నుంచి, ఆయన అల్లుడు రియాస్(44) కోజికోడ్ జిల్లా బేపోర్ నియోజకవర్గం నుంచి, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విజయన్ కూతురు వీణ, రియాస్ 2020లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. వీణ బెంగళూరులో ఐటీ సంస్థను నడుపుతుండగా రియాస్ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. రియాస్ 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నుంచి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.
కేరళ అసెంబ్లీకి 11 మంది
మహిళా ఎమ్మెల్యేలు
2001 తర్వాత మొట్టమొదటి సారిగా కేరళ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం ఈసారి రెండంకెలకు చేరింది. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 140 స్థానాలకు 103 మంది మహిళలు బరిలో నిలవగా 11 మంది మాత్రం విజయం సాధించారు. వీరిలో 10 మంది అధికార ఎల్డీఎఫ్‌కు చెందిన వారు, ఒక్కరు మాత్రమే ప్రతిపక్ష యూడీఎఫ్ ఎమ్మెల్యే. ఆరోగ్యమంత్రి కేకే శైలజ 60 వేల ఓట్ల మెజారిటీతో మత్తన్నూర్ నుంచి ఘన విజయం సాధించారు. 2016 ఎన్నికల్లో 8 మంది మాత్రమే నెగ్గగా, 1996లో 13 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
మామ సీఎం.. అల్లుడు ఎమ్మెల్యే
Published Tue, May 4 2021 4:59 AM | Last Updated on Tue, May 4 2021 8:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment