Kerala assembly elections
-
కేరళలో కుస్తీ.. త్రిపురలో దోస్తీ
రాధాకిషోర్పూర్/అంబాసా(త్రిపుర): త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్–సీపీఎం పార్టీల కూటమిని ప్రధాని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ఓట్ల కోసం కేరళలో పోటాపోటీగా కుస్తీ పడుతూ, అవే పార్టీలు ఉమ్మడిగా ఓటర్లను మోసంచేసేందుకు త్రిపురలో దోస్తీ చేస్తున్నాయని మోదీ విమర్శించారు. టిప్రా మోతాకి మోదీ పరోక్షంగా చురకలంటించారు. ‘ఈ విపక్ష కూటమికి ఇంకొన్ని ఇతర పార్టీలు బయటి నుంచి మద్దతు తెలుపుతున్నాయి. ఈ కూటమికి పడే ప్రతీ ఓటు త్రిపురను కొన్నేళ్లు వెనుకడుగు వేసేలా చేస్తుంది’ అని అన్నారు. శనివారం గోమతి జిల్లాలోని రాధాకిషోర్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘ గతంలో అధ్వానంగా పాలించిన పార్టీలు మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం బయల్దేరాయి. అవి కేరళలో కుస్తీ పడతాయి. త్రిపురలో దోస్తీ కడతాయి’ అని అన్నారు. ‘ ఓట్లు చీల్చేందుకు విపక్షం యత్నిస్తోంది. ఇంకొన్ని చిన్న ‘ఓట్లు చీల్చే’ పార్టీలుంటాయి. విజయవంతంగా ఓట్లు చీలిస్తే ఫలితాలొచ్చాక అందుకు ‘ప్రతిఫలం’ పొందుతాయి. ఇంకొందరు తమకు తామే గెలుపుగుర్రాలుగా భావించి గెలిచాక ఇంట్లోనే గడియపెట్టుకుని కూర్చుంటారు’ అని మోదీ విమర్శించారు. రెండంచుల కత్తితో జాగ్రత్త ‘గత లెఫ్ట్, కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనులను విభజించి పాలించాయి. మేం మాత్రం మిజోరం నుంచి వలసవచ్చిన వేలాది బ్రూస్ కుటుంబాలుసహా అన్ని గిరిజన తెగల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నాం. గిరిజన భాష కోక్బోరోక్ను మా ప్రభుత్వమే ఉన్నత విద్యలో ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్లోనూ గిరిజనప్రాంతాల అభివృద్ధికి రూ.1 లక్ష కోట్లు కేటాయించాం’ అని అన్నారు. ‘ కాంగ్రెస్–సీపీఎం డబుల్ ఎడ్జ్(రెండు అంచుల) కత్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబుల్ ఎడ్జ్ ప్రభుత్వమొస్తే ప్రజలకు లబ్ధిచేకూరే అన్ని పథకాలను తెగ్గోసి పడేస్తుంది. మా డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేసి ఈ ఈశాన్య రాష్ట్రంలో అభివృద్ధి గతిని సుస్థిరం చేయండి’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు. ధలాయ్ జిల్లాలోని అంబాసాలోనూ మోదీ ప్రచార సభలో ప్రసంగించారు. దక్షిణాసియా ముఖద్వారంగా త్రిపుర ‘ఈ రెండు పార్టీలు పేదప్రజల కష్టాలు తీరుస్తామని అలుపెరగకుండా వాగ్దానాలు చేస్తారుగానీ పేదల బాధ, కష్టాలను ఎప్పటికీ అర్ధంచేసుకోరు. రాష్ట్రంలో తొలి దంతవైద్య కళాశాల బీజేపీ హయాంలోనే సాకారమైంది. గతంలో పోలీస్స్టేషన్లపై సీపీఎం శ్రేణులు ఆధిపత్యానికి దుస్సాహసం చేసేవి. మేమొచ్చాక శాంతిభద్రతలు నెలకొల్పాం. గతంలో రాష్ట్రంలోని యువత జీవనోపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్లేవారు. మా హయాంలో ఉద్యోగావకాశాలు పెరిగాయి. యాక్ట్ ఈస్ట్ విధానంతో రాష్ట్రం పురోగమిస్తోంది. త్వరలోనే అభివృద్ధి ఆసియా ముఖద్వారంగా త్రిపుర మారనుంది’ అని మోదీ అభిలషించారు. -
6 లింగమార్పిడి సర్జరీలు.. ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య
తిరువనంతపురం: కేరళ తొలి ట్రాన్స్‌జెండర్ రేడియో జాకీ, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన మొదటి ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ మంగళవారం ఆత్మహత్య చేసుకుని మరణించారు. కొచ్చిలోని ఆమె నివాసంలో ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అనన్య కుమారి ఏడాది నుంచి పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. గతేడాది జూన్‌లో ఆమె ఆరు లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. వీటి వల్లనే అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం. తనకు సర్జరీ చేసిన ఆస్పత్రి, వైద్యులపై పలు ఆరోపణలు చేశారు అనన్య కుమారి. లింగ మార్పిడి చికిత్సల అనంతరం తాను పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. సర్జరీ చేసి ఏడాది పూర్తి కావొస్తున్న తన ఆరోగ్యం కుదుటపడలేదని.. దారుణమైన బాధ కలుగుతుందని ఆరోపించారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తాను ఇంకా కోలుకోలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని గతంలో అనన్య కుమారి డిమాండ్ చేశారు. అనన్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అన్యన్య కుమారిది ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. అనారోగ్య కారణాల వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడంతో అనన్య కుమారి పేరు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో అనన్య డెమొక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ(డీఎస్‌జేపీ) అభ్యర్థిగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి పీకే కుంజలికుట్టికి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేశౠరు. అయితే పోలింగ్‌కు ఒక రోజు ముందు ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. తనను బెదిరిస్తున్నారని.. ముఖ్యంగా సొంత పార్టీ నాయకులే తనను వేధింపులుకు గురి చేస్తున్నారని.. అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆమె డీఎస్‌జేపీకి ఓటు వేయవద్దని బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. -
మామ సీఎం.. అల్లుడు ఎమ్మెల్యే
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. మామ, అల్లుళ్ల జంట అసెంబ్లీలోకి త్వరలో అడుగిడనుంది. ఆ మామ, అల్లుళ్లు ఎవరో కాదు సాక్షాత్తూ సీఎం పినరయి విజయన్, ఆయన అల్లుడు పి.ఎ.మొహమ్మద్ రియాస్..!. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్(77) కన్నూర్ జిల్లా ధర్మదామ్ నుంచి, ఆయన అల్లుడు రియాస్(44) కోజికోడ్ జిల్లా బేపోర్ నియోజకవర్గం నుంచి, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విజయన్ కూతురు వీణ, రియాస్ 2020లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. వీణ బెంగళూరులో ఐటీ సంస్థను నడుపుతుండగా రియాస్ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. రియాస్ 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నుంచి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. కేరళ అసెంబ్లీకి 11 మంది మహిళా ఎమ్మెల్యేలు 2001 తర్వాత మొట్టమొదటి సారిగా కేరళ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం ఈసారి రెండంకెలకు చేరింది. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 140 స్థానాలకు 103 మంది మహిళలు బరిలో నిలవగా 11 మంది మాత్రం విజయం సాధించారు. వీరిలో 10 మంది అధికార ఎల్డీఎఫ్కు చెందిన వారు, ఒక్కరు మాత్రమే ప్రతిపక్ష యూడీఎఫ్ ఎమ్మెల్యే. ఆరోగ్యమంత్రి కేకే శైలజ 60 వేల ఓట్ల మెజారిటీతో మత్తన్నూర్ నుంచి ఘన విజయం సాధించారు. 2016 ఎన్నికల్లో 8 మంది మాత్రమే నెగ్గగా, 1996లో 13 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
కేరళ అసెంబ్లీ: అరుదైన ఘట్టం
తిరువనంతపురం: 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిన కేరళ అసెంబ్లీలో మరో అరుదైన ఘట్టం ఆకర్షణీయంగా మారనుంది. కేరళ అసెంబ్లీలో మామా అల్లుళ్లు కొలువుదీరనున్నారు. అది మరెవ్వరో కాదు ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన అల్లుడు మొహమ్మద్ రియాజ్. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయన్ 50 వేల పైచిలుకు మెజారిటీలో ఘన విజయం సాధించగా, కాన్నూర్ జిల్లాలోని ధర్మదాం నుంచి రియాజ్ ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా కేరళ అసెంబ్లీలో వివిధ రాజకీయ నాయకుల వారసులుగా కుమారులు, కుమార్తెలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. ముఖ్యంగా కేరళ కాంగ్రెస్ (ఎం) చీఫ్ జోస్ కే మణి, ఆయన సోదరి భర్త, యూడీఎఫ్ అభ్యర్థి ఎంపీ జోసెఫ్ ఇద్దరూ పాల, త్రిక్కారిపూర్ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు. అలాగే తోడుపుళ నుంచి యూడీఎఫ్ అభ్యర్థిగా కేరళ కాంగ్రెస్ చైర్మన్ పీజే జోసెఫ్ గెలుపొందగా, కోతమంగళం నుంచి బరిలో నిలిచిన ఆయన అల్లుడు డాక్టర్ జోసెఫ్‌కు నిరాశే ఎదురైంది. అంతేనా వీరితోపాటు కాంగ్రెస్ నేతలు, దివంగత ముఖ్యమంత్రి కరుణాకరన్ వారసులు కే మురళీధరన్ (ఎంపీ), పద్మజా వేణుగోపాల్ కూడా ఓటమిని చవి చూడక తప్పలేదు. వీరితో పాటు 140 స్థానాలకు ఏప్రిల్ 6న జరిగిన పోలింగ్‌లో దాదాపు 20 మంది అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వారసులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో మామ అల్లుళ్లు కలిసి సభలో భాగం కావడం ఇదే మొదటిసారి. బహుశా ఈ సరికొత్త దృశ్యం ఆవిష్కారం కోసమే రియాజ్ 2009లో లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారేమో అని పలువురు చమత్కరిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఘన విజయం నేపథ్యంలో కేరళ సీఎం రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం విజయన్ గవర్నర్‌కు తన రాజీనామా సమర్పించారు. -
ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఎన్నికల ఫలితాలు
-
కేరళ: మరోసారి లెఫ్ట్ ప్రభుత్వం.. ధర్మదాం నుంచి పినరయి విజయం
లైవ్ అప్డేట్స్: ► "కేరళ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించినందుకు పినరయి విజయన్, ఎల్డీఎఫ్ కు నా అభినందనలు. మేము ఇద్దరం కలిసి విస్తృతమైన విషయాలపై పనిచేస్తాము. కోవిడ్ -19 మహమ్మారిని భారతదేశం నుంచి తరిమికొట్టే విషయంలో కలిసి పనిచేయనున్నాం" అని పీఎం మోడీ ట్వీట్ చేశారు. ► కేరళ ఎన్నికల్లో ధర్మదాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సీపీఎం నాయకుడు పినరయి విజయన్ కాంగ్రెస్ సీ రఘునాథన్ పై 50,123 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ► "కేరళ ప్రజలు మరోసారి మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. అయితే కోవిడ్ -19 వల్ల పెద్దగా సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదు. ప్రతి ఒక్కరూ కోవిడ్ -19కి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి" అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు ► శశి థరూర్ పినరయి విజయన్ ను అభినందించారు "గత 44 సంవత్సరాలలో మొదటిసారి తిరిగి ఎన్నికైనందుకు @CMOKerala @vijayanPinarayiకి నా అభినందనలు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని గౌరవించడం వారి కర్తవ్యం. #కోవిడ్ & మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు మన మద్దతు ఉండాలి "అని ఎల్డిఎఫ్ చారిత్రాత్మక విజయంపై శశి థరూర్ ట్వీట్ చేశారు. మెట్రోమాన్ ఈ శ్రీధరణ్‌కు షాక్...! ► మెట్రోమాన్ ఈ శ్రీధరణ్‌కు షాక్ తగిలింది. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది. పాలక్కడ్ నియోజకవర్గంపై కాంగ్రెస్ మరోసారి తన సత్తాచాటింది. కాగా మరోసారి ఎల్డీఫ్ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ► కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ మట్టన్నూర్ నియోజకవర్గం నుంచి 61,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేరళ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ గెలిచిన చరిత్ర ఇదేనని చెబుతున్నారు. ► కేరళలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధికార ఎల్డీఎఫ్ ఆధిక్యంలో దూసుకు పోతుంది. 44 స్థానాల్లో గెలుపొంది, 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్డీఎఫ్ 10 స్థానాలను కైవసం చేసుకుని, 35 లీడ్‌లో ఉంది. ► ఎల్డీఎఫ్ 70 , యూడీఫ్ 37 స్థానాలలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎల్డీఎఫ్ 26, యూడీఫ్ 6 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ► త్రిశూర్‌లో బిజేపీ అభ్యర్థి సురేష్ గోపి ముందంజలో ఉన్నారు. ► రెండోసారి విజయం దిశగా దూసుకుపోతున్న లెఫ్ట్ ప్రభుత్వం.. ► పినరయి విజయన్‌దే ఈవిజయం అంటున్న విశ్లేషకులు.. ► ధర్మదాంలో సీఎం పినరయి విజయన్ ఆధిక్యం ► పుత్తుపల్లిలో ఊమెన్ చాందీ చాంది ఆధిక్యం ► కేరళలో పాలక్కడ్‌లో మెట్రోమాన్ శ్రీధరన్ ముందంజ.. ► కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ ధర్మదంలో పోటీ చేసిన పినరయి విజయన్(CPM) పుట్టుపల్లిలో పోటీ చేసిన ఊమెన్ చాందీ(కాంగ్రెస్) కళహాకూట్టంలో పోటీ చేసిన శోభా సురేంద్రన్(బీజేపీ) ► కేరళలో ఆధిక్యం దిశలో దూసుకుపోతున్న అధికార ఎల్డీఎఫ్.. ఎల్డీఎఫ్ 78 , యూడీఎఫ్ 48 ► కేరళలో తొలి రౌండ్లో ఎల్డీఎఫ్ ఆధిక్యం.. ఎల్డీఎఫ్ 68, యూడీఎఫ్ 47 ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 33, యూడీఎఫ్ 18 చోట్ల ఆధిక్యం ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 14, యూడీఎఫ్ 9 చోట్ల ఆధిక్యం ► కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు అధికారంలోకి రానున్నారో నేటి ఫలితాలు తేల్చనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్‌లో భాగంగా కేరళలో 633 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. కేరళలో 140 శాసనసభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. -
విత్ డ్రా చేస్కో లేదంటే చంపేస్తాం: ట్రాన్స్‌జెండర్‌కు వేధింపులు
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉందని ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిపై కొందరు దుండగులు బరి తెగించారు. ఆమెను వేధింపులకు గురి చేసి చివరకు ఎన్నికల పోటీ నుంచి విరమించుకునేటట్టు చేశారు. దీంతో ఎన్నికల నుంచి ఆమె విరమించుకుంది. ఆమె నామినేషన్ ఉపసంహరించకోవడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఈ పరిణామం కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగింది. ఆమెను వేధింపులకు గురి చేసింది సొంత పార్టీ నాయకులు కావడం గమనార్హం. తొలిసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా అనన్య కుమారి అలెక్స్ పోటీలో నిలిచింది. దీంతో ఆమె ప్రత్యేక ఆకర్షణగా మారారు. మలప్పురం జిల్లాలోని వెంగర నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. డెమోక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ (డీఎస్‌జేపీ) తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని తీవ్రమైన హెచ్చరికలు వచ్చాయి. దీంతో చివరకు ఆ వేధింపులు భరించలేక ఆమె నామినేషన్ ఉపసంహరించుకుని పోటీ నుంచి విరమించుకుంది. అయితే ఆ వేధింపులకు పాల్పడిన వారు ఎవరో కాదు సొంత పార్టీ నాయకులే. డీఎస్‌జేపీ నాయకులు యూడీఎఫ్ అభ్యర్థికి పీకే కున్హాల్ కుట్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనన్య కుమారి అలెక్స్ నామినేషన్ ఉపసంహరించుకోవాలని వేధింపులకు పాల్పడ్డారు. వేధించడంతో పాటు అవమానించారని అనన్య బాధపడింది. అనన్య కుమారి మొదటి రేడియో జాకీగా గుర్తింపు పొందారు. న్యూస్ యాంకర్‌గా, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్‌గా పేరు పొందారు. -
ఐసోలేషన్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి.. అయోమయంలో కార్యకర్తలు
కొచ్చి: మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు అసెంబ్లీ ఎన్నికల వలన కూడా పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు, భారీగా జనాలు గుమిగూడడం వంటివి జరుగుతుండడంతో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. దీని ఫలితంగా తాజాగా ఓ ఎమ్మెల్యే అభ్యర్థికి పాజిటివ్ తేలింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఐసోలేషన్‌లో ఉండడంతో ప్రస్తుతం కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఎన్నికల సందర్భంగా ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ - యూడీఎఫ్) కొచ్చి అభ్యర్థి టోనీ చమ్మని ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. అయితే తనకు కరోనా సోకిందని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని.. ప్రచారం చేయలేనని చెప్పేశారు. దీంతో పార్టీ నాయకులు, ఆయన అనుచరులు ఆందోళనలో పడ్డారు. కొన్ని రోజుల్లో ఎన్నికలు ఉండగా ప్రజలను కలిసేందుకు అభ్యర్థి రాకపోతే దాని ప్రభావం పోలింగ్‌లో తెలుస్తుందని భయాందోళన చెందుతున్నారు. గెలిచే స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థి టోనీ చమ్మని మాత్రం మీరు ప్రచారం చేసేయండి.. మనదే విజయం అని చెబుతున్నారు. ఈ విధంగా కరోనా వలన రాజకీయ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
‘రాహుల్‌కు పెళ్లి కాలే.. గర్ల్స్ మీరు వెళ్లొద్దు’
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా కేరళలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఈ సమయంలో వ్యక్తిగత దూషణలకు తెర లేచింది. ఈ క్రమంలోనే ఓ మాజీ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మాయిలు రాహూల్ వద్దకు వెళ్లకండి. అతడికి ముందే పెళ్లి కాలేదు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఓ సభలో మాజీ ఎంపీ జోయెస్ జార్జ్ ఆయన మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. ‘‘రాహుల్ గాంధీకి అసలే పెళ్లి కాలేదు. అతడి వద్దకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ కార్యక్రమాలన్నీ మహిళల విద్యాలయాల్లోనే జరుగుతాయి. అక్కడకు వెళ్లి రాహుల్ అమ్మాయిలకు ఎలా వంగాలి?, ఎలా నిలబడాలి? అని నేర్పుతాడు. అందుకే నా ప్రియమైన అమ్మాయిలు రాహుల్ వద్దకు వెళ్లి ఇలాంటి పనులు చేయవద్దు. అతడికి పెళ్లి కాలేదు’ అని జోయెస్ జార్జ్ పేర్కొన్నాడు. రాహుల్ గాంధీ.. సోమవారం కేరళ ప్రచారంలో పాల్గొన్నారు. కొచ్చిలో ఏర్పాటుచేసిన సభలో కొంతమంది అమ్మాయిలకు రాహుల్ మార్షల్ ఆర్ట్స్ మెలకువలను స్వయంగా నేర్పారు. దీన్నిటార్గెట్ చేస్తూ జోయెస్ జార్జ్ మాట్లాడటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు ధర్నా చేపట్టారు. జోయెస్ జార్జ్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. This is also Kerala..!! EX-MP Joyce George said “Rahul Gandhi's programme is such that he will only visit women colleges. He will go there and teach girls to bend. My dear children, please don't bend and stand in front of him. He is not married.”@RahulGandhi #Kerala #Election pic.twitter.com/TaENHud6Xy — Raam Das (@PRamdas_TNIE) March 30, 2021 -
సైద్ధాంతిక అయోమయంలో ఆ రెండు పార్టీలు
చకరక్కల్: సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు సైద్ధాంతికపరంగా అయోమయంలో పడ్డాయని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. కేరళలో కత్తులు దూసుకుంటున్న ఈ రెండు పార్టీలు.. బెంగాల్లో కలిసికట్టుగా పోరాడుతుండటం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సమయంలో గమనించదగ్గ విషయమని ఆయన అన్నారు. కేరళలోని ధర్మదామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి సీకే పద్మనాభన్ తరఫున ఆయన శనివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ సీపీఎం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ బరిలో ఉన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశ విషయమై వెల్లువెత్తిన ఆందోళనలను అణచివేసేందుకు అధికార సీపీఎం అణగదొక్కేందుకు యత్నించగా, కాంగ్రెస్ పార్టీ ఎప్పటి మాదిరిగానే కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హామీ ఇస్తోందన్నారు. ఒక్క బీజేపీ మాత్రమే ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో పోరాటం చేస్తోందని చెప్పారు. బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన సీఎం విజయన్.. విచారణ అధికారులు ఆయన కార్యాలయానికి వెళ్లగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తోందంటూ ఎదురుదాడికి దిగారన్నారు. కేరళ ప్రజలు ప్రధాని మోదీ వెంటే నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం కేరళకు భారీ ప్రాజెక్టులు మంజూరు చేసేలా తమ పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. -
ఎన్నికల బరిలో తొలి ట్రాన్స్‌జెండర్
కేరళలో ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే మొదటి ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా అనన్య పోటీకి దిగింది. అయితే అక్కడ పోటీలో ఉన్నది అత్యంత బలమైన అభ్యర్థి. ‘అతను స్త్రీలు ఇంటిపట్టునే ఉంటే చాలనుకునే భావజాలం ఉన్న అభ్యర్థి. అతనికి స్త్రీ గురించి ట్రాన్స్జెండర్ల గురించి కూడా గౌరవం నేర్పడానికి రంగంలో దిగాను’ అని అనన్య అందరినీ ఆకట్టుకుంటోంది. పి.కె.కున్హాలి కుట్టి అంటే మలప్పురంలో చాలా సీనియర్. ఎం.పి.గా ఎం.ఎల్.ఏగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి. మంత్రిగా పని చేశాడు. ‘కుంజప్ప’గా ముద్దు పేరు కలిగినవాడు. ఔట్లుక్ పత్రిక వ్యాఖ్యానం ప్రకారం కేరళలో ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ (ఐ.యు.ఎం.ఎల్) పార్టీకి వెన్నుముకలాంటివాడు. ఇప్పుడు ఆ కొండను ఢీకొనడానికి ఒక శివంగి రంగంలో దిగింది. ఆ శివంగి పేరు అనన్య కుమారి. ఏప్రిల్ జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ‘వెంగర్’ నియోజక వర్గం నుంచి కున్హాలి కుట్టి నిలబడితే ‘డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ’ తరఫున ప్రత్యర్థిగా నిలిచింది. టెలివిజన్ సెట్‌ను ఆమె ఎన్నికల గుర్తుగా కేటాయించారు.‘ఇది మొదలు. నాది తొలి అడుగు. నేను సఫలం అయితే దేశంలోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ చట్టసభల్లో పోటీకి నిలవడానికి మరింత ముందుకు వస్తారు’ అని 28 ఏళ్ల అనన్య కుమారి అంది. కేరళలో ఇది వరకే ‘తొలి ఎఫ్.ఎమ్ ట్రాన్స్‌జెండర్ రేడియో జాకీ’గా అనన్య గుర్తింపు పొందింది.‘కున్హాలి కుట్టి ప్రాతినిధ్యం వహించే పార్టీ ఎన్నో ఏళ్లుగా స్త్రీలను ప్రత్యేక్ష ఎన్నికలలో అనుమతించలేదు. కున్హాలి భావజాలం కూడా అదే. స్త్రీలు, టాన్స్జెండర్లు మంచిపాలన అందిస్తారని నిస్వార్థంగా పని చేస్తారని నేను నిరూపించదలుచుకున్నాను’ అంటుంది అనన్య. కొళ్లాం ప్రాంతానికి చెందిన అనన్య ఇంటర్ వరకూ చదువుకుంది. అనన్య అభ్యర్థిత్వం వెలువడగానే కేరళలోని ట్రాన్స్జెండర్ల సమూహం హర్షం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా ఉత్సాహం కలిగించే వార్త’ అని రియా ఇషా అనే ట్రాన్స్‌జెండర్ మోడల్ అంది. ఎలక్షన్లు ఎంత ఖర్చుతో కూడుకున్నవో ఎన్ని మతలబుల వ్యవహారమో సామాన్యులకు తెలుసు. కాని వివక్షకు గురయ్యే సమూహం నుంచి ఒక అభ్యర్థి వచ్చి పోటీకి నిలవడాన్ని చాలా మంది హర్షిస్తున్నారు. -
నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీలోకి..
కాసరగోడ్: కేరళలోని కాసరగోడ్ జిల్లా మంజేశ్వరం నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీకి దిగిన కె. సుందర తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. సోమవారం సుందర మీడియాతో మాట్లాడుతూ.. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాననీ, ఇకపై బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ విజయం కోసం అలుపెరగకుండా పని చేస్తానని ప్రకటించారు. అయితే, సుందరను బీజేపీ బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసిందంటూ ఊహానాలు వెలువడ్డాయి. కె.సుందర, కె. సురేంద్రన్ పేర్లు ఒకేలా ఉండటంతో 2016 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సుందరకు 467 ఓట్లు పడ్డాయి. ఆ ఎన్నికల్లో ఐయూఎంఎల్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ చేతిలో కె.సురేంద్రన్ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. అబ్దుల్ రజాక్‌కు బోగస్ ఓట్లు పడ్డాయంటూ సురేంద్రన్ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే, రజాక్ 2018లో చనిపోవడంతో ఆయన ఆ కేసును ఉపసంహరిం చుకున్నారు. బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ -
కోటి రూపాయల్లేని ముఖ్యమంత్రి.. ఎవరాయన?
తిరువనంతపురం: అభివృద్ధి చెందిన రాష్ట్రంగా.. దేవభూమిగా పేర్కొనే కేరళలో రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ప్రధాన పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే నామినేషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీపీఐ (ఎం) అభ్యర్థిగా కన్నూరు జిల్లా ధర్మాడం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్లో పినరయి సమర్పించిన అఫిడవిట్లో ఉన్న వివరాలు ఆసక్తికరంగా మారాయి. కోటి రూపాయల ఆస్తులు కూడా లేకపోవడం గమనార్హం. పినరయి ఆస్తులన్నీ కలిపితే కేవలం రూ.54 లక్షలు మాత్రమే ఉన్నాయి. 2020 21లో ఆయన వార్షిక ఆదాయం రూ.2.87 లక్షలుగా పేర్కొన్నారు. రెండు సొంత ఇళ్లు ఉన్నాయని, సొంత వాహనం లేదని ప్రకటించారు. పినరయి పేరిట రూ.51.95 లక్షల విలువైన స్థిరాస్తులు, 2.04 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. అయితే తన భార్య పేరిట రూ.35 లక్షల విలువైన స్థిరాస్తులు, రూ.29.7లక్షల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. అయితే ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైరయ్యారని ఈ సందర్భంగా అఫిడవిట్లో పినరయి స్పష్టంగా రాయించారు. అయితే వీరిద్దరికీ అప్పులు ఏమీ లేకపోవడం విశేషం. భార్య పేరిట రూ.3.3 లక్షలు విలువ చేసే 80 గ్రాముల బంగారం ఉంది. పినరయిపై రెండు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అఫిడవిట్లో ప్రస్తావించారు. పినరయి 2016 నుంచి కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్లీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయం సాధిస్తారని ప్రచారం సాగుతోంది. ఇక్కడ సీపీఐ (ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 2వ తేదీన విడుదల కానున్నాయి. చదవండి: హీరో కమల్‌హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..? చదవండి: ఎన్నికల వేళ బీజేపీకి షాకిచ్చిన తమిళనాడు సీఎం -
కాంగ్రెస్ విషాదయోగం
‘అదృష్టం అందలమెక్కిస్తానంటే... బుద్ధి బురదలోకి లాగింద’ని సామెత. కేరళలో కాంగ్రెస్ పరిస్థితి అలాగేవుంది. అది ముఠా పోరుతో సతమతమవుతోంది. మరో 25 రోజుల్లో... అంటే వచ్చే నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా అక్కడ అధికారంలో వున్న పార్టీ వరసగా రెండోసారి గెలిచిన ఆనవాయితీ లేదు గనుక... ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రజా తంత్ర కూటమి (యూడీఎఫ్)కి అవకాశం వుండొచ్చని కొందరు చెబుతున్నారు. మరోపక్క అధికార వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్) వరసగా రెండోసారి అధికారంలోకి రావటం ఖాయమని సర్వేలంటున్నాయి. ఎవరి అంచనాలెలావున్నా ఎన్నికల సమరాంగణానికి వెళ్లే పార్టీకి విజయసాధనే ప్రధాన లక్ష్యంగా వుంటుంది. కానీ అదేం ప్రారబ్ధమో...ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆ కర్తవ్యాన్ని విడనాడి, తనకలవాటైన అంతర్గత పోరుతో సతమతమవుతోంది. సారధ్యం వహించాల్సిన పార్టీయే ఈ దుస్థితిలో పడటం చూసి యూడీఎఫ్‌లోని ఇతర పార్టీలు సహజంగానే నీరుగారుతున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్ష పదవికి ఎవరినో ఒకరిని నియమించమని, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నిరుడు సెప్టెంబర్‌లో కోరిన 23మంది సీనియర్ నేతల అభీష్టం ఇంకా నెరవేరలేదు. వీలు కుదిరినప్పుడల్లా వారిని అవమానించటానికీ, పక్కకు నెట్టేయటానికీ పార్టీ అధిష్టానం చేయని ప్రయత్నమంటూ లేదు. వీరంతా సోనియాగాంధీకి వీర విధేయులు. అధినేత మెప్పు పొందటానికి వీరిలో ఎవరికెవరూ తీసిపోరు. కానీ నానాటికీ పార్టీ ప్రాభవం అడుగంటుతుంటే...సమీప భవి ష్యత్తులో అది జవసత్వాలు పొందే అవకాశాలు కనబడకపోవటంతో బెంబేలెత్తి ఆ లేఖ రాశారు. ఎని మిది నెలలు కావస్తున్నా వారికి జవాబూ లేదు సరిగదా... వారి పదవులు వరసబెట్టి ఊడబెరకటం మాత్రం రివాజైంది. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయద’టారు. కేరళ పీసీసీలో జరుగుతున్నది అదే. ఈ అంతర్గత పోరుతో విసిగిన సీనియర్ నేత పీసీ చాకో పార్టీకి ఓ దణ్ణం పెట్టి నిష్క్రమించారు. ఆయన చిన్న స్థాయి నాయకుడేమీ కాదు. రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జిగా పనిచేసిన వ్యక్తి. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, సీనియర్ నేత రాహుల్ గాంధీలకు సన్నిహితుడు. కానీ చాకోను సైతం ఆ 23మంది నేతల ఖాతాలో వేశారు. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం అడుగంటిందంటున్నారు. కేరళలో పార్టీ రెండు వర్గాలుగా చీలి పదవుల కోసం కీచులాడుకుంటుండగా, సరిచేయాల్సిన పార్టీ నిర్లిప్తంగా వున్నదంటున్నారు. ఫలితంగా కేరళలో ఓటమి ఖాయమని వాపోతున్నారు. 140 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో యూడీఎఫ్ ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్ 91 నుంచి 95 వరకూ స్థానాలు తీసుకునే అవకాశంవుంది. మిత్రపక్షాల్లో ప్రధానమైన ఐయూఎంఎల్‌కు 27, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్)కు 10 ఇవ్వాల్సివుంటుంది. అవి తమ వాటాను పెంచమని అడిగే ఛాన్సుంది కూడా. ఇవిగాక చిన్నా చితకా పార్టీలు మరో అయిదు వున్నాయి. ఇంతక్రితం యూడీఎఫ్‌లో భాగస్వామిగా వున్న కేరళ కాంగ్రెస్(మణి) వర్గం ఈసారి ఎల్డీఎఫ్ వైపు వెళ్లిపోయింది. గతంలో ఆ పార్టీకి రివాజుగా ఇచ్చే 11 స్థానాల్లో ఎవరెవరికి ఏయే స్థానాలివ్వాలో తేల్చాలి. ఇవన్నీ ఇంకా కొలిక్కి రాలేదు. భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గినా, తమ అభ్యర్థులెవరో ఇంకా ప్రకటించలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ వుంటే...ఎల్డీఎఫ్ మాత్రం చురుగ్గా కదులుతోంది. ప్రధాన భాగస్వామ్య పక్షం సీపీఎం తమకు కేటాయించిన 85 స్థానాల్లో 83 స్థానాలకు అభ్యర్థుల్ని కూడా ప్రకటించి, చాలా ముందుగానే ప్రచారం మొదలుపెట్టింది. ఫ్రంట్‌లోని ఇతర పార్టీలను కూడా తొందరపెడుతోంది. ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా ఘనంగా ప్రకటించిన బీజేపీ... అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయలేదు. ఈ రెండు ప్రధాన కూటముల జాబితాలూ ఖరారై, అటునుంచి ఎవరైనా వస్తారేమో చూశాకే ఆ పని చేసే అవకాశం వుంది. కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకూ కేరళకు ప్రత్యేక స్థానముంది. స్వస్థలంలో ఓడిపోయిన పార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఆ రాష్ట్రంనుంచే ఎంపీగా నెగ్గారు. కనీసం అందుకోసమైనా ఈసారి కేరళలో అధికారం దక్కకపోతే పరువుపోతుందని ఆయన భావిస్తున్నట్టు లేరు. అవినీతి ఆరోపణలపై తొలి రెండు సంవత్సరాల్లోనే ముగ్గురు ఎల్డీఎఫ్ మంత్రులు తప్పుకోవాల్సిరావటం, లాకప్ మరణాలు, బంగారం స్మగ్లింగ్ స్కాం వంటి ఆరోపణల విషయంలో నిలదీసి ఎల్డీఎఫ్ను ఇరకాటంలో పెట్టాలని యూడీఎఫ్ చూస్తోంది. శబరిమల వివాదం విషయంలో సీపీఎం తన మౌలిక సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరించిందని యూడీఎఫ్కానీ, బీజేపీకానీ ఎటూ విమర్శించే అవకాశం లేదు. అలా చేస్తే అది ఎల్డీఎఫ్కు మేలు చేయటమే అవుతుంది. వీటి సంగతలావుంచి సీట్ల ఖరారు కోసం యూడీఎఫ్ ప్రధాన నేతలంతా ఇంకా ఢిల్లీలోనే ప్రదక్షిణాలు చేస్తున్నారు. బీజేపీ సైతం తన ప్రచార భేరి మోగించిన తరుణంలో చాకో రాజీనామా వార్త యూడీఎఫ్‌ను కుంగదీసిందనటంలో సందేహం లేదు. అధికారంలోకి రావటానికి అంతో ఇంతో అవకాశముందనుకున్నచోట పార్టీ మసకబారుతుంటే తలకలవాటైన రీతిలో కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తున్న వైనం ఆ పార్టీ నిర్వా్యపకత్వానికీ, నిస్తేజానికీ అద్దం పడుతోంది. -
శబరిమల ఘటనలు నన్ను నొప్పించాయి
తిరువనంతపురం: కేరళ ఎన్నికల వేళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం శబరిమలలో గెలుపుకోసం ఒకడుగు వెనక్కితగ్గినట్టు కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం 2018లో శబరిమల వివాదంపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. కేరళ దేవాదాయ శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్, 2018లో శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించి జరిగిన ఘటనలపట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఇది జరిగి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించారు. మంత్రిగారి వ్యాఖ్యలపై స్పందిం చిన కాంగ్రెస్, బీజేపీలు, ఎల్డీఎఫ్ ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. రాజకీయ పార్టీలు, భక్తులు, సామాన్య జనంతో చర్చించాకే సుప్రీంకోర్టు తుది తీర్పుని అమలు చేస్తామని సురేంద్రన్ హామీ ఇచ్చారు. ‘‘2018లో శబరిమలలో జరిగిన ఘటనలు మనందర్నీ నొప్పించాయి. నన్ను కూడా. అలా జరగకుండా ఉండాల్సింది’’అని ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తోన్న సీపీఐ(ఎం)నాయకుడు సురేంద్రన్ వ్యాఖ్యానించారు. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల, సురేంద్రన్ ప్రకటన మోసపూరితమని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ మాట్లాడుతూ మంత్రిగారిది మొసలి కన్నీరు అని ఎద్దేవా చేశారు. శబరిమలకు జరిగిన అన్యాయానికి, నష్టానికి వెయ్యిసార్లు గంగానదిలో మునిగినా క్షమించలేమని వ్యాఖ్యానించారు. వివక్షకి తావులేకుండా, అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత, 2018లో, 10 నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్సున్న 12 మంది మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు అడ్డుకోవడంతో మూడు నెలల పాటు హై డ్రామా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రధానంగా సీపీఐ(ఎం) పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బతగిలింది. మొత్తం 20 స్థానాల్లో 19 స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పట్టుకోల్పోయిన సీపీఐ(ఎం)తిరిగి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంపుంజుకుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం సీపీఐ(ఎం) నిర్వహించిన ఇంటింటి సర్వేలో శబరిమల విషయంలో ఒక వర్గం ప్రజలు ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు గుర్తించింది. ‘శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విస్త్రుత ధర్మాసనం ముందుంది. తుది తీర్పు ఏదైనప్పటికీ, ప్రజలతోనూ, భక్తులతోనూ, రాజకీయ పార్టీలతోనూ చర్చించాకే దాన్ని అమలు చేస్తాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులుకాని, శబరిమల పోరాటానికి సంబంధించిన అన్ని సాధారణ కేసులను, ఇటీవలే పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని మంత్రి సురేంద్రన్ గుర్తుచేశారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ వీడిన సీనియర్ నేత ఆయన మాట వినకుండా తప్పు చేశానన్న ఇందిరాగాంధీ! -
లెఫ్ట్ భవిష్యత్ కాంగ్రెస్ చేతిలో
ఒక రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కరచాలనం చేస్తూ మరో రాష్ట్రంలో అదే పార్టీపై కత్తులు దూస్తూ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన లెఫ్ట్ పార్టీలకు అంతా అగమ్యగోచరంగా ఉంది. ఒక చోట నిలబెట్టుకోవాలి, మరో చోట పునర్వైభవం సాధించాలి వామపక్ష పార్టీలను తేల్చడమైనా, ముంచడమైనా ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది. కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి, పశ్చిమ బెంగాల్లో తిరిగి పట్టు సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ వైచిత్రిని ఎదుర్కోవడమే ఇప్పుడు వామపక్ష పార్టీల ముందున్న అసలు సిసలు సవాల్‌గా మారింది. అసోం, తమిళనాడు, పాండిచ్చేరితో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠను పెంచుతున్న పశ్చిమ బెంగాల్, కేరళలో ఎన్నికల వేడి రాజుకుంది. 2016లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలప్రయోగంగా నిలిచినప్పటికీ ఈ సారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తోనే కలిసి వామపక్షాలు ఎన్నికల బరిలో దిగాయి. బెంగాల్లో ఆదివారం జరిగిన కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి నిర్వహించిన మెగా ర్యాలీకి జనం వెల్లువెత్తినప్పటికీ కాంగ్రెస్ అగ్రనేతలెవరూ హాజరుకాలేదు. కేరళలో యూడీఎఫ్ కూటమి విజయానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బెంగాల్లో వామపక్ష నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలే ర్యాలీకి హాజరయ్యారు. మరోవైపు కేరళలో వామపక్షాల నేతృత్వంలోని అధికారి ఎల్డీఎఫ్కు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. కేరళలో వామపక్ష పార్టీలను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీతో తెరవెనుక అవగాహనతో పని చేస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. బీజేపీ ఓటమి కోసం పని చేయాల్సిన కాంగ్రెస్ ఇలా చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. లెఫ్ట్ దారి వివాదాస్పదం భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కాషాయ వ్యతిరేక శక్తులన్నీ పిలుపునిస్తున్న వామపక్ష పార్టీలు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)తో చేతులు కలపడానికి సిద్ధపడడం వివాదానికి దారి తీస్తోంది. 30 శాతం ముస్లిం జనాభా ఉన్న బెంగాల్లో 100–110 సీట్లలో వారి ప్రభావం ఉంటుంది. ముస్లిం ఓట్లను కొల్లగొట్టడానికి పరిషద్ అబ్బాస్ సిద్దికి నేతృత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)లను తమ కూటమిలో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. కోల్‌కతాలో జరిగిన మెగా ర్యాలీకి సిద్దికి హాజరై ప్రసంగించారు. ‘‘మేమే ప్రత్యామ్నాయం, మేమే లౌకికవాదులం, మేమే మీ భవిష్యత్’’ అన్న నినాదంతో బెంగాల్ బరిలోకి దిగిన వామపక్ష నాయకులు తమ వేదికపై ముస్లిం మత పెద్ద సిద్దికిని కూర్చోబెట్టడం పలు విమర్శలకు దారి తీస్తోంది. కరడుగట్టిన మతవాదితో కలుస్తూ లౌకిక రాగాలాపన ఎలా సాధ్యమంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు హోరెత్తిపోతున్నాయి. వామపక్షాలు వేసే అడుగులు బీజేపీకి లబ్ధి చేకూరుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పదేళ్లుగా మమతా దీదీ అణచివేత చర్యల్ని ఎదుర్కొంటూనే ప్రజా ఉద్యమాల ద్వారా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలైతే వామపక్ష పార్టీలు చేస్తూనే ఉన్నాయి. – న్యూఢిల్లీ ఓటు బ్యాంకు 2016లో లెఫ్ట్, కాంగ్రెస్ కూటమికి 38% ఓట్లువచ్చాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు పోలయిన ఓట్ల కంటే ఇది కేవలం 7శాతం మాత్రమే తక్కువ. అందులో వామపక్ష పార్టీలే 26శాతం ఓటు బ్యాంకుని సాధిం చాయి. అయితే గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ఓటు బ్యాంకు ఏకంగా 7.52 శాతానికి తగ్గిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో మిత్రలాభం, మిత్రభేదాన్ని ఏకకాలంలోనే ఎదుర్కొంటూ వామపక్షాలు ఎలా ముందుకు సాగుతాయో చేచి చూడాల్సిందే. -
బీజేపీ సీఎం అభ్యర్థిగా ‘మెట్రోమ్యాన్’!
తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోన్న బీజేపీ అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతోంది. మరి కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు కూడా ఉన్నాయి. తమిళ ప్రజలు బీజేపీ పట్ల అంత విశ్వాసం చూపరు. ఈ క్రమంలో కాషాయ పార్టీ కేరళలో పాగా వేసేందుకు సీరియస్‌గా ట్రై చేస్తోంది. దానిలో భాగంగా మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్‌ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం కేరళ బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కే సురేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించారు. మిగతా వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. శ్రీధరన్ గత వారం బీజేపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం అని తెలిపారు. తాజాగా బీజేపీ ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ.. ‘‘ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దాని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎక్కడ నుంచి పోటీ చేసినా నేను గెలుస్తాననే నమ్మకం ఉంది. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే, నేను ఇప్పుడు నివసిస్తున్న మలప్పురంలోని పొన్నానికి సమీపంగా ఉండే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను”అని తెలిపారు. కొచ్చి మెట్రో ప్రాజెక్టుకు గురువుగా ఉన్న శ్రీధరన్ తాను ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే సంప్రదాయాన్ని పాటించనని తెలిపారు. ‘‘నేను ఇళ్లకు, దుకాణాలకు, ఊర్లకు వెళ్లను. కానీ నా సందేశం ఓటర్లందరికి చేరుతుంది’’ అన్నారు. వృద్ధులను పక్కకు పెడుతున్న బీజేపీ తాజాగా 88 ఏళ్ల శ్రీధరన్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. చదవండి: మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా? లవ్ జిహాద్‌పై శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు! -
కేరళ అసెంబ్లీకి వారసుల పోటీ
తిరువనంతపురం: దేశంలో వారసత్వ రాజకీయాలకు తెరదించాలని ఎవరు ఎంత మొత్తుకున్నా అనాదిగా వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. మే 16, 27న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కేరళలో కూడా 140 స్థానాలకుగాను ఎక్కువ మంది రాజకీయ వారసులు పోటీలో ఉన్నారు. సహజంగానే అధికార పక్షమైన యూడిఎఫ్ నుంచే ఎక్కువ మంది రాజకీయ వారసులు పోటీ చేస్తున్నారు. రెండో స్థానంలో ప్రతిపక్ష ఎల్డీఎఫ్ నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయ వారసత్వం అనకపోవచ్చేమోగానీ ఈసారి సముచిత స్థానాలను దక్కించుకోవాలని ఆశిస్తున్న బీజేపీ నుంచి భార్యా భర్తలు పోటీ చేస్తున్నారు. యూడీఎఫ్ నుంచి మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రుల సంబంధీకులు 17 మంది పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకుడు కే. కరుణాకరన్ కూతురు పద్మజా వేణుగోపాల్ త్రిస్సూర్ నియోజక వర్గం నుంచి, కుమారుడు కే. మురళీధరన్ వట్టియురుకావు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, మాజీ సీఎం మొహమ్మద్ కోయ కుమారుడు ఎంకే మునీర్, మాజీ డిప్యూటి సీఎం అవుకాది కుట్టి నహా కుమారుడు పీకే అబ్దూరబ్బ్, మాజీ మంత్రి టీఎం జాకబ్ కుమారుడు అనూప్ జాకోబ్, మాజీ ఎమ్మెల్యే జార్జ్ ఈడెన్ కుమారుడు హిబీ ఈడెన్, మాజీ మంత్రి బేబీ జాన్ కుమారుడు శిబూ బేబీ జాన్, మాజీ మంత్రి పీఆర్. కురూప్ కుమారుడు కేపీ మోహనన్, ఎంపీ వీరేంద్ర కుమార్ కుమారుడు ఎంవీ. శ్రేయమ్స్ కుమార్, మాజీ మంత్రి కే. నారాయణ కురూప్ కుమారుడు డాక్టర్ ఎన్. జయరాజ్, మాజీ ఎమ్మెల్యే పీ.సీతిహజి కుమారుడు పీ.బషీర్, మాజీ స్పీకర్ కార్తికేయన్ కుమారుడు కేఎస్. శబరినాథన్, మాజీ మంత్రి ఎన్. రామకష్ణన్ కూతురు అమతా రామకష్ణన్, మాజీ ఎమ్మెల్యే తొప్పిలి రవి కుమారుడు సూరజ్ రవి, మాజీ ఎమ్మెల్యే కేకే. థామస్ కుమారుడు సిరియాక్ థామస్, మంత్రి ఆర్యదన్ మొహమ్మద్ కుమారుడు ఆర్యదన్ షౌకత్, మాజీ ఎమ్మెల్యే కేసీ. చరియన్ భార్య మరియమ్మ చరియన్లు పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ నుంచి ఎనిమిది మంది వారసులు పోటీలో ఉన్నారు. మాజీ మంత్రి ఆర్ బాలకష్ణ పిళ్లై కుమారుడు కేబీ. గణేష్ కుమార్, మాజీ మంత్రి నీలాలోహిత్ దాస్ భార్య జమీలా ప్రకాశమ్, మాజీ సీఎం పీకే. వాసుదేవన్ నాయర్ కూతురు శారదా మోహన్, మాజీ మంత్రి ఎంవీ. రాఘవన్ కుమారుడు ఎంవీ. నికేష్ కుమార్, మాజీ మంత్రి వీకే. రాజన్ కుమారుడు వీఆర్. సునీల్ కుమార్, మాజీ మంత్రి కేఎం. జార్జి కుమారుడు కే. ఫ్రాన్సిస్ జార్జి, మాజీ ఎమ్మెల్యే పీఐ. పాలోజ్ కుమారుడు సజూ పాల్, మాజీ ఎమ్మెల్లే ఎంకే. కేశవన్ కుమారుడు కే. అజిత్ పోటీ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి శోభా సురేంద్రన్ పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, ఆమె భర్త కేకే. సురేంద్రన్ పొన్నాని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. -
ప్రతి ఐదేళ్లకూ మార్చేయడమే...
ప్రపంచంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు మొదటిసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కేరళ. 2011లో రెండోసారి సీఎం అయిన ఊమెన్ చాందీ నేతృత్వంలోని యునెటైడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) ఐదేళ్ల సంక్షుభిత పాలన తర్వాత అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఈసారి తమదే అధికారమనే ధీమా సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్లో కనిపిస్తోంది. కొద్ది నెలల క్రితం జరిపిన అన్ని ఎన్నికల సర్వేలూ ఎల్డీఎఫ్కే విజయావకాశాలున్నట్టు సూచిస్తున్నాయి. 2011 కేరళ అసెంబ్లీ ఎన్నికలు చరిత్ర నిలిచిపోయే విధంగా ఫలితాలనిచ్చాయి. 140 సీట్లున్న అసెంబ్లీలో స్వల్ప ఆధిక్యంతో ప్రతిపక్షంలో ఉన్న యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. సీపీఎం అగ్రనేతలతో, రాష్ట్ర సీపీఎం కార్యదర్శి పినరాయి విజయన్‌తో కీచులాటలకు దిగినప్పటికీ సమర్థ ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్న సీనియర్ కమ్యూనిస్ట్ వీఎస్ అచ్యుతానందన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్కు 68 సీట్లు రాగా, 72 స్థానాలతో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఉప ఎన్నికల్లో రెండుమూడు విజయాలు, వామపక్ష ప్రజాతంత్ర కూటమిలోని ఒకట్రెండు చిన్న పార్టీలను బయటికి లాగి వాటితో చేతులు కలపి యూడీఎఫ్ సుస్థిరంగా సర్కారును పూర్తికాలం నడిపింది. స్కాములే స్కాములు... అక్రమార్జన, కుంభకోణాలు, అవినీతికి మారుపేరుగా చాందీ ప్రభుత్వం నిలిచింది. ఈ కుంభకోణాలు, అప్రతిష్ట నుంచి బయటపడానికి చేసిన ప్రయత్నం పాక్షిక మద్యపాన నిషేధం కూడా యూడీఎఫ్ సర్కారును మరిన్ని అవినీతి కుంభకోణాల్లోకి నెట్టింది. సోలార్ కుంభకోణం, బార్ యజమానుల నుంచి లంచాలు ఆశించారనే కుంభకోణంతో చాందీ సర్కారు పరువు పూర్తిగా పోయింది. అవినీతి ఆరోపణల కారణంగా చాందీ కేబినెట్ నుంచి కేరళ కాంగ్రెస్ నేత కె.ఎం.మణి రాజీనామా చేయాల్సివచ్చింది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో అసంబద్ధంగా వ్యవహరించి మరో మంత్రి ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. ఇవన్నీ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్కు అనుకూల పరిణామాలే అయినా మరో పక్క ఆర్ఎస్ఎస్ మద్దతుతో కొన్ని జిల్లాల్లో బలపడుతున్న బీజేపీ మార్క్సిస్టులకు కలవరం పుట్టిస్తోంది. బీజేపీ బలం మతం-కులం? కేరళలో ముస్లింలు, క్రైస్తవులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండడం కూడా బీజేపీకి రాష్ట్రంలో అడుగుపెట్టి బలపడానికి అనుకూల అంశమని కాషాయ కూటమి నేతలు భావిస్తున్నారు. కేరళలో హిందువులు 54.7 శాతం, ముస్లింలు 24.6 శాతం, క్రైస్తవులు 18.4 శాతం ఉన్నారని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ హిందువుల్లో అత్యధిక వర్గాల మద్దతు కమ్యూనిస్టులకు లభిస్తోంది. అగ్రవర్ణాలతోపాటు హిందూ బీసీల్లో పెద్ద వర్గమైన ఈళవ కులస్థుల మద్దతు మొదటి నుంచీ కమ్యూనిస్టులకే లభిస్తోంది. జనాభాలో ఈ వర్గం జనాభా 24 శాతం ఉందని అంచనా. కల్లుగీత వృత్తిగా ఉన్న ఈళవ వర్గంవారిని అంటరానివారిగా కేరళ హిందూ సమాజం చూసే రోజుల్లో ఈ వర్గం కుటుంబంలో పుట్టిన నారాయణ గురు సంఘసంస్కర్తగా ఎదిగారు. ఈళవులతోపాటు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన కృషిచేశారు. ఆయన పేరుతో స్థాపించిన శ్రీనారాయణ గురు పరిపాలనా యోగం(ఎస్ఎన్డీపీ) ఈ సామాజికవర్గంపై ప్రభావం చూపిస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీలకు తొలి నుంచి పట్టు ఉన్న ఈ సామాజికవర్గానికి దగ్గరవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఎస్ఎన్డీపీ ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేశన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కొద్ది నెలల క్రితం నటేశన్ ఓ ఈళవ వర్గం మద్దతుతో భారత ధర్మజన సేన(బీడీజేఎస్) అనే పార్టీ ప్రారంభించి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఇంకా ఒకటి రెండు కుల పార్టీలతో చేతులు కలిపి బీజేపీ కేరళలో చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు సాధించాలని ఆశిస్తోంది. అంటే ఇప్పటి వరకూ సీపీఎంకు మద్దతు ఇస్తున్న హిందూ బీసీ వర్గాల ఓట్లు చీల్చడానికి కాషాయ కూటమి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. బీజేపీ కూటమి ఎక్కువ ఓట్లు చీల్చితే యూడీఎఫ్ మరోసారి మెజారిటీ సీట్లు కైవసం చేసుకునే అవకాశముందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్వేలే నిజమైతే సీఎం పదవి వీఎస్కా? విజయన్కా? కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించినప్పటి నుంచీ ఎస్సీ, బీసీ వర్గాల మధ్య పనిచేయడంతో ఈ కులాల జనం కమ్యూనిస్టుల వెంటే చాలా కాలం నడిచారు. ఈళవ కుటుంబాల్లో పుట్టిన ఏకే గోపాలన్, వీఎస్ అచ్యుతానందన్ వంటి బడా నేతలు కమ్యూనిస్ట్ పార్టీల్లో చేరి శ్రామికవర్గం తరఫున పోరాడారు. అయితే, ఇదే సామాజికవర్గానికి చెందిన పినరాయి విజయన్ కేరళ సీపీఎం కార్యదర్శిగా పట్టు సాధించారు. అయితే, ఇదే వీఎస్ అచ్యుతానందన్‌కు విజయన్‌కు పొసగదు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ మద్దతు విజయన్‌కే ఉండేది. 92 ఏళ్ల వయసులో అచ్యుతానందన్ మరోసారి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. తర్వాత తరానికి చెందిన విజయన్(72) తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తూ సీఎం పదవికి సీపీఎం తరఫున తానూ అభ్యర్థినని పరోక్షంగా ప్రకటించారు. 96 ఏళ్ల వయసులో కేఆర్ గౌరి అసెంబ్లీకి పోటీ 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వాన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతల్లో బతికి ఉన్న ఏకైక నేత కేఆర్ గౌరి. ఈళవ వర్గానికి చెందిన గౌరి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన టీవీ థామస్‌ను పెళ్లాడింది. పార్టీ చీలినప్పుడు ఆమె సీపీఎంలో చేరగా, థామస్ సీపీఐలో ఉండిపోయారు. 1967 నంబూద్రిపాద్ కేబినెట్లో భార్యాభర్తలిద్దరూ రెండు కమ్యూనిస్ట్‌పార్టీల తరఫున మంత్రులుగా ఉన్నారు. 1987 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించాక సీఎం పదవిని ఆశించిన గౌరికి అది దక్కలేదు. అయినా ఈకే నాయనార్ సర్కారులో మంత్రిగా పనిచేశారు. అయితే. 1993లో సీపీఎం నుంచి వైదొలిగి జనాధిపత్య సంరక్షణ సమితి(జేఎస్ఎస్) అనే చిన్న పార్టీ ప్రారంభించి యూడీఎఫ్‌లో చేరారు. యూడీఎఫ్ సర్కార్లలో మంత్రిగా పనిచేసి కొన్నేళ్ల క్రితం ఈ కూటమి నుంచి వైదొలిగారు. కిందటేడాది చివరిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పదవిని కొడియేరి బాలకృష్ణన్ ఆహ్వానం మేరకు తన పార్టీని సీపీఎంలో విలీనం చేయడానికి ప్రయత్నించారుగాని కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. చివరికి ఎల్డీఎఫ్ నాయకత్వం ఈ ఎన్నికల్లో జేఎస్ఎస్కు సీట్లు కేటాయించడానికి నిరాకరించడంతో ఆమె ఈసారి బీజేపీ కూటమిలో చేరడానికి సమాయత్తమౌతున్నారు. 96 ఏళ్ల వయసులో గౌరి మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే 1956 నవంబర్ ఒకటిన అవతరించిన ప్రస్తుత కేరళలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో(1957) అప్పటి అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ(సీపీఐ) కాంగ్రెస్‌ను ఓడించి అత్యధిక సీట్లు సాధించింది. మెజారిటీకి ఒకట్రెండు సీట్లు తగ్గడంతో వి.ఆర్.కృష్ణయ్యర్ వంటి కమ్యూనిస్టు సానభూతిపరులైన ఇండిపెండెంట్ల మద్దతుతో ఈఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి కావడం చారిత్రక పరిణామం. ప్రైవేటు విద్యాసంస్థల జాతీయం, భూసంస్కరణల వంటి ప్రగతిశీల చర్యలు తీసుకుంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా మత, కుల శక్తులు కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు మద్దతుతో ఉద్యమించాయి. అప్పటి కాంగ్రెస్ నేత ఇందిరాగాంధీ సలహాతో నెహ్రూ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు తుంగలోకి తొక్కి తొలి కమ్యూనిస్టు ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. తర్వాత నెమ్మదిగా కమ్యూనిస్టులు కోలుకున్నారు. అంతటి రాజకీయ చైతన్యమున్న కేరళలో 1964 చీలిక తర్వాత సీపీఐ, సీపీఎం 1967లో ఒకసారి చేతులు కలిపినా తర్వాత వాటి దారులు వేరయ్యాయి. సీపీఐ తన జాతీయ విధానంలో భాగంగా 1970ల చివరి వరకూ కాంగ్రెస్‌తో దోస్తీ కొనసాగించింది. 1980 ఎన్నికల నుంచీ ఉభయ కమ్యూనిస్టులూ చేతులు కలిపి లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎల్డీఫ్)పేరుతో అధికారంలో, ప్రతిపక్షంలోనూ సహజీవనం సాగిస్తున్నారు. మొత్తం సీట్లు 140 మ్యాజిక్ ఫిగర్ 71 2011 ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుపొందిన సీట్లు యునెటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ - యూడీఎఫ్ 72 (కాంగ్రెస్ (39), ముస్లిం లీగ్ (20), కేరళ కాంగ్రెస్, జేఎస్ఎస్, ఆరెస్పీ) లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ - ఎల్డీఎఫ్ 68 (సీపీఎం (42), సీపీఐ (13), జేడీఎస్, ఎన్సీపీ, ఇతరులు ) -
తిరువనంతపురం నుంచి శ్రీశాంత్ పోటీ
తిరువనంతపురం: కెరీర్ ప్రారంభంలోనే అద్భుత ప్రతిభకనబర్చి 'కేరళ స్పీడ్ స్టర్'గా ఖ్యాతిపొంది, అంతలోనే ఫిక్సింగ్ ఆరోపణలతో ఆటకు దూరమైన క్రికెటర్ శ్రీశాంత్ జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. రాజకీయ అరంగేట్రంపై కొద్దిరోజులుగా వినిపిస్తోన్న ఊహగానాలకు తెరదించుతూ శ్రీశాంత్ శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. కేరళ బీజేపీ చీఫ్ కుమ్మనన్ రాజశేఖరన్, ఇంకొందరు ముఖ్యనేతల కమలం కండువవా కప్పి శ్రీశాంత్ ను పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తోన్న బీజేపీ తొలి విడతగా 51 మంది అభ్యర్థుల జాబితాను విడుదలచేసింది. కీలకమైన తిరువనంతపురం స్థానం నుంచి శ్రీశాంత్ బరిలోకి దిగుతున్నాడు. సిటీలో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండటంతోపాటు యువతరం ఓట్లను కొల్లగొట్టగలడనే నమ్మకంతోనే శ్రీశాంత్ కు తిరువనంతపురం టికెట్ ఇచ్చినట్లు తెలిసింది.