తిరువనంతపురం నుంచి శ్రీశాంత్ పోటీ
తిరువనంతపురం: కెరీర్ ప్రారంభంలోనే అద్భుత ప్రతిభకనబర్చి 'కేరళ స్పీడ్ స్టర్'గా ఖ్యాతిపొంది, అంతలోనే ఫిక్సింగ్ ఆరోపణలతో ఆటకు దూరమైన క్రికెటర్ శ్రీశాంత్ జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. రాజకీయ అరంగేట్రంపై కొద్దిరోజులుగా వినిపిస్తోన్న ఊహగానాలకు తెరదించుతూ శ్రీశాంత్ శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. కేరళ బీజేపీ చీఫ్ కుమ్మనన్ రాజశేఖరన్, ఇంకొందరు ముఖ్యనేతల కమలం కండువవా కప్పి శ్రీశాంత్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తోన్న బీజేపీ తొలి విడతగా 51 మంది అభ్యర్థుల జాబితాను విడుదలచేసింది. కీలకమైన తిరువనంతపురం స్థానం నుంచి శ్రీశాంత్ బరిలోకి దిగుతున్నాడు. సిటీలో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండటంతోపాటు యువతరం ఓట్లను కొల్లగొట్టగలడనే నమ్మకంతోనే శ్రీశాంత్ కు తిరువనంతపురం టికెట్ ఇచ్చినట్లు తెలిసింది.