worlds richest
-
ప్రపంచంలోనే రిచెస్ట్ అల్లుడు..
భారతీయ కుటుంబాలలో అల్లుడికి విశిష్ట హోదా ఉంటుంది. ప్రత్యేకించి సంపన్న కుటుంబాల వివాహాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాల్లో అల్లుడికి స్వాగత సత్కారాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఓ వివాహం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అల్లుడు, మామగార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఆరు రోజుల పాటు గ్రాండ్ వెడ్డింగ్బిలియనీర్ స్టీల్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ తన కుమార్తె, అల్లుడి వివాహాన్ని మరచిపోలేని వేడుకగా మార్చాలనుకున్నారు. ఖర్చు ఏమాత్రం వెనుకాడకుండా వనీషా మిట్టల్, అమిత్ భాటియాల వివాహం జరిపించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఆరు రోజులపాటు ఈ వివాహ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. 2004లో జరిగిన ఈ పెళ్లికి రూ. 240 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి.పారిస్ నగరం మొత్తం ఈ వేడుకను జరుపుకుంటున్నట్లు అనిపించేంతగా ఏర్పాట్లు చేశారు. ప్రఖ్యాత సెలబ్రిటీ చెఫ్ మున్నా మహారాజ్‌ను భారత్ నుండి ఫ్రాన్స్‌కు రప్పించారు. ఈ గ్రాండ్ ఇండియన్ వెడ్డింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది అతిథులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీతో సహా బాలీవుడ్, హాలీవుడ్ తారలు తమ ప్రదర్శనలతో హంగామా చేశారు. అంతర్జాతీయ పాప్ సంచలనం కైలీ మినోగ్ కూడా పెళ్లిలో ప్రదర్శన ఇచ్చారు. రూ. ఒక గంట ప్రదర్శనకు ఆమె రూ. కోటి తీసుకున్నట్లు చెబుతారు.ఎవరీ అమిత్ భాటియా ?అమిత్ భాటియా బ్రిటీష్-ఇండియన్ వ్యాపారవేత్త, బిలియనీర్ ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ అల్లుడు. అయేబే క్యాపిటల్ (గతంలో స్వోర్డ్ ఫిష్ ఇన్వెస్ట్మెంట్స్ )వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్. అమిత్ తన ప్రాథమిక విద్యను ఢిల్లీలో పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లారు.అమిత్ తన వృత్తిపరమైన ప్రయాణాన్ని న్యూయార్క్‌లో మెరిల్ లించ్, మోర్గాన్ స్టాన్లీతో ప్రారంభించారు. వెస్ట్ లండన్‌లోని షెపర్డ్స్ బుష్‌లో ఉన్న ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఎఫ్సీకి ఆయన సహ-యజమాని. క్రీడలతో పాటు అమిత్ వ్యాపార సంస్థలు రియల్ ఎస్టేట్, సాంకేతిక రంగాల్లో విస్తరించాయి. స్ట్రాటజిక్ లాండ్ అండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అయిన సమ్మిక్స్ క్యాపిటల్‌లో ఈయన వ్యవస్థాపక భాగస్వామి.గతంలో 2016 ఆగస్టులో బ్రీడాన్ గ్రూప్‌ను కొనుగోలు చేసే వరకు హోప్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత బ్రీడాన్ గ్రూప్ బోర్డ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా చేరారు. కార్పొరేట్ ఫైనాన్స్, ప్రైవేట్ ఈక్విటీలో 20 సంవత్సరాల అనుభవంతో అమిత్ భాటియా విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. వనీషా మిట్టల్, అమిత్ భాటియా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
ఇక్కడ అందరూ రిచ్.. రూ. కోటి సంపాదిస్తారు..!
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం ఏది అంటే చాలా మంది అమెరికా అని భావిస్తారు. కానీ ఆ దేశం కన్నా ధనిక దేశాలు చాలానే ఉన్నాయి. యూరప్‌లోని లక్సెంబర్గ్ దేశం ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీగా ఉంది. ఇక్కడ ప్రతిఒక్కరూ సగటున కోటి రూపాయలు సంపాదిస్తారంటే నమ్ముతారా? ఇలాంటి టాప్ సంపన్న దేశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. సాధారణంగా ఒక దేశం ఆర్థిక విజయాన్ని తలసరి జీడీపీ ఆధారంగా అంచనా వేస్తారు. అయితే ఇది వ్యక్తిగత ఆర్థిక శ్రేయస్సును చూపుతుంది. కానీ ఈ ప్రమాణం ద్వారా దేశాలను పోల్చడానికి వీలుండదు. 2022 సంవత్సరంలో తలసరి జీడీపీతోపాటు, ప్రజల కొనుగోలు శక్తి, ఉత్పాదకత ప్రమాణాల ఆధారంగా ‘ది ఎకనామిస్ట్ అండ్ సోల్స్టాడ్, సోండ్రే’ నుంచి వచ్చిన డేటా ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలేవో ఇప్పుడు చూద్దాం.. టాప్‌లో లక్సెంబర్గ్ తలసరి జీడీపీ ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో యూరప్ దేశమైన లక్సెంబర్గ్ టాప్‌లో ఉంది. 2022లో ఈ దేశం తలసరి జీడీపీ 1,26,426 డాలర్లు అంటే భారత్ కరెన్సీలో సుమారు రూ. కోటి. దీని ప్రకారం ఇక్కడ సగటున ప్రతిఒక్కరూ కోటి రూపాయలు సంపాదిస్తున్నారన్నమాట. ఇక కొనుగోలు శక్తిలోనూ ఈ దేశం టాప్‌లో ఉంది. అయితే ఉత్పాదత విషయంలో మాత్రంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో నార్వే అగ్ర స్థానంలో ఉంది. చిన్న దేశాలే మెరుగ్గా.. ఆర్థికంగా చిన్న దేశాలే మెరుగ్గా ఉన్నాయి. మొదటి 10 సంపన్న దేశాలను తీసుకుంటే వాటిలో ఎనిమిది దేశాల్లో జనాభా కోటి కంటే తక్కువే. తలసరి జీడీపీ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన లక్సెంబర్గ్‌లో జనాభా కేవలం 6.60 లక్షలు. దాని అనుకూలమైన పన్ను విధానాల కారణంగా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ఈ చిన్న దేశం గణనీయమైన సంపద కారణంగా అక్కడి పౌరులు ఉచిత విద్య, వైద్యం, రవాణా సదుపాయాలను ఆనందిస్తున్నారు. -
బ్రిటిషర్లు, మొఘల్ చక్రవర్తులకే అప్పు.. నాటి సంపన్న భారతీయ వ్యాపారి..
స్వాతంత్య్రానికి పూర్వం నుంచే చరిత్రలో భారతీయులు అనేక విషయాల్లో కేంద్ర బిందువులుగా నిలిచారు. అలాగే వ్యాపారంలోనూ చరుకైన పాత్ర పోషించిన భారతీయులు ఉన్నారు. విర్జీ వోరా మొఘల్ పాలనలో పెద్ద పేరున్న వ్యాపారవేత్త. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఆయనను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుర్తించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫైనాన్షియర్ చరిత్రకారుల ప్రకారం.. విర్జీ వోరా 1617 - 1670 మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద ఫైనాన్షియర్. 1590లో జన్మించిన విర్జీ వోరా 1670లో మృతి చెందారు. హోల్‌సేల్ వ్యాపారి అయిన ఆయన వ్యక్తిగత సంపద అప్పట్లో సుమారు రూ. 80 లక్షలు. అంటే ఇప్పట్లో అది కొన్ని లక్షల కోట్లకు సమానం. ఆ మేరకు ఆయన ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త అని అర్థం చేసుకోవచ్చు. చారిత్రక పత్రికల ప్రకారం.. విర్జీ వోరా మిరియాలు, బంగారం, ఏలకులు, ఇతర సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిర్వహించేవారు. 1629 - 1668 మధ్య కాలంలో బ్రిటీష్ వారితో అనేక విధాలుగా వ్యాపార సంబంధాలు నెరిపిన విర్జీ వోరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టంగా నిర్మించుకున్నారు. అప్పట్లో అన్ని వ్యాపారాల్లో విర్జీ వోరాదే ఏకైక గుత్తాధిపత్యం. ఉత్పత్తుల మొత్తం స్టాక్‌ను కొనుగోలు చేసి వాటిని భారీ లాభంతో విక్రయించేవాడు. షాజహాన్‌కు అరబ్ గుర్రాలు విర్జీ వోరా వడ్డీ వ్యాపారి కూడా. సొంతంగా వ్యాపారాలు పెట్టుకునే బ్రిటిష్‌వారికి ఆయన డబ్బు అప్పుగా ఇచ్చేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశంలోని దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు డబ్బు కోసం విర్జీ వోరాను ఆశ్రయించినట్లు చెబుతారు. విర్జీ వోరా మొఘల్ రాజు షాజహాన్‌కు నాలుగు అరబ్ గుర్రాలను బహుమతిగా ఇచ్చాడని కూడా చరిత్రకారులు పేర్కొంటారు. -
మార్క్ జుకర్‌బర్గ్ సమీపానికి ముకేశ్ అంబానీ
దేశీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సరికొత్త రికార్డు సాధించారు. వారాంతానికల్లా వ్యక్తిగత సంపద 77.4 బిలియన్ డాలర్లను తాకింది. దీంతో ప్రపంచంలోనే అపర కుబేరుల్లో 5వ ర్యాంకుకు చేరుకున్నారు. తద్వారా సంపదలో ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్(86 బిలియన్ డాలర్లు) సమీపంలో ముకేశ్ నిలిచారు. ముకేశ్ గ్రూప్‌లోని డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు లాభపడటంతో శుక్రవారం ఒక్క రోజులోనే వ్యక్తిగత సంపదకు 3.5 బిలియన్ డాలర్లు జమకావడం ఇందుకు సహకరించింది. రెండు వారాల క్రితమే సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమించిన ముకేశ్ తాజాగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ అధినేత ఎలన్ మస్క్, గూగుల్ సహవ్యవస్థాపకులు సెర్జీ బ్రిన్, లారీ పేజ్‌లను సైతం వెనక్కి నెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. సాధారణంగా టాప్-5 ప్రపంచ కుబేరుల్లో అమెరికన్లు, తదుపరి యూరోపియన్లు, ఒక మెక్సికన్ చోటు సాధిస్తూ వచ్చే సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్‌కు ముకేశ్ చెక్ పెట్టినట్లు విశ్లేషకులు సరదాగా పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. జియో ప్లాట్‌ఫామ్స్ స్పీడ్ గత నెలలో ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 10వ ర్యాంకులో నిలిచారు. తదుపరి గ్రూప్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లాభాల బాటలో సాగడంతో వ్యక్తిగత సంపద మరింత బలపడుతూ వచ్చింది. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచీ చూస్తే ముకేశ్ సంపద 22.3 బిలియన్ డాలర్లు పెరిగింది. మార్చిలో నమోదైన కనిష్టం నుంచి చూస్తే గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 145 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25 శాతం వాటా విక్రయం ద్వారా భారీగా విదేశీ నిధులను సమీకరించడం సహకరించింది. దీంతోపాటు.. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,000 కోట్లు సమీకరించడంతో రుణరహిత కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్, గూగుల్, సిల్వర్‌లేక్ తదితరాలు ఇన్వెస్ట్చేయడం ప్రస్తావించదగ్గ విషయంకాగా.. దీనికి జతగా ఇటీవల రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్ వాటా కొనుగోలు చేయనుందన్న అంచనాలు ఇటీవల సెంటిమెంటుకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఈ ఏడాది అత్యంత భారీగా సంపదను పెంచుకున్న వ్యక్తులలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నిలవడం విశేషం! బెజోస్ సంపద 2020లో ఇప్పటివరకూ 64 బిలియన్ డాలర్లమేర బలపడింది! -
బిల్ గేట్స్‌ను దాటేశాడు
న్యూయార్క్ : అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సంపద 10,500 కోట్ల డాలర్లకు పెరగడంతో బిల్ గేట్స్ సంపదను మించిపోయినట్టయింది. అమెజాన్ షేర్లు 12 నెలల గరిష్టస్ధాయికి పెరగడంతో బెజోస్ నికర సంపద భారీగా ఎగిసింది. దీంతో ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ మార్కెట్ విలువ 57 శాతం పెరిగింది. ఈ ఏడాది అమెజాన్ షేర్లు 6.6 శాతం ఎగిశాయి. అమెరికాలో థ్యాంక్స్‌గివింగ్ డే అనంతరం అయిదు వారాల వ్యవధిలో ఆన్లైన్ స్పెండింగ్ మార్కెట్లో అమెజాన్ ఏకంగా 89 శాతం మార్కెట్ షేర్‌ను దక్కించుకోవడం గమనార్హం. బెజోస్ సంపద భారీగా పెరగడంతో 1999లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ చేరుకున్న గరిష్ట మార్కెట్ విలువను అధిగమించారు. అయితే బిల్ గేట్స్ తన సంపదలో అధిక భాగాన్ని బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఇవ్వకుంటే ఆయన నికర సంపద 15,000 కోట్ల డాలర్లు దాటేదని నిపుణులు పేర్కొంటున్నారు. 19996 నుంచి గేట్స్ 70 కోట్ల మైక్రోసాఫ్ట్ షేర్లు, 300 కోట్ల డాలర్ల నగదు సహా పలు ఇతర ఆస్తులను బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఇచ్చారు. -
కుబేరుల ‘రియల్’ సంపద..!
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల సంపదలో ఐదో వంతు రియల్ ఎస్టేట్‌దే. అలాగే ఆసియా కుబేరుల మొత్తం సంపదలో సింహభాగం రియల్టీదేనని అం తర్జాతీయ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ, సావిల్స్ తాజా నివేదిక పేర్కొంది. వెల్త్-ఎక్స్ సంస్థతో కలిసి రూపొందించిన నివేదిక ముఖ్యాంశాలు..., ప్రపంచంలో 2 లక్షల మంది అపర కుబేరులు (ఆల్ట్రా హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్) తమ సం పదలో ఐదో వంతు రియల్టీలో ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచంలో అపర కుబేరుల మొత్తం సంపద 27,77,000 కోట్ల డాలర్లు. దీంట్లో రియల్టీ ఆస్తులు వాటా 19%(5,32,800 కోట్ల డాలర్లు). యూరోపియన్ కుబేరులకు అత్యధిక రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. వారి మొత్తం ఆస్తుల్లో రియల్ ఎస్టేట్ వాటా 31%. ఆ తర్వాతి స్థానంలో 27% వాటాతో ఆసియా కుబేరులు, 26% వాటాతో మధ్య ఆసియా కుబేరులున్నారు. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 180 లక్షల కోట్ల డాలర్లు. దీంట్లో 72%యజమానులే నివసిస్తున్న రెసిడెన్షియల్ ప్రొపర్టీయే. ప్రపంచ జనాభాలో అపర కుబేరుల సంఖ్య 0.003 శాతమే. అయితే ప్రపంచవ్యాప్త రియల్టీలో వీరి వాటా 3%. ఒక్కొక్కరి సగటు రియల్టీ సం పద 2.65 కోట్ల డాలర్లు(సుమారుగా రూ.159 కోట్లు) 2018 నాటికి అపర కుబేరుల సంఖ్య 22% పెరుగుతుంది. ప్రస్తుతం 27.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న వీరి సంపద 2018 నాటికి 36 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.